వాట్సప్‌లో విసిగిస్తున్న తెలియని మెసేజ్‌లు, షాకింగ్ కారణం ఇదే !

ప్రపంచంలో అత్యంత ఎక్కువగా మెసేజ్ చేసే ఫ్లాట్ ఫాం ఏదైనా ఉందంటే అది ఒక్క వాట్సప్ మాత్రమేనని చెప్పవచ్చు.


ప్రపంచంలో అత్యంత ఎక్కువగా మెసేజ్ చేసే ఫ్లాట్ ఫాం ఏదైనా ఉందంటే అది ఒక్క వాట్సప్ మాత్రమేనని చెప్పవచ్చు. రోజులో అధికభాగం ఈ యాప్ లో నే గడిపేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే లేటెస్ట్ గా బయటకొచ్చిన ఓ విషయం వాట్సప్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. రీసెంట్ గా జరిగిన ఈ విషయంతో ఇప్పుడు అందరూ ఉలిక్కి పడుతున్నారు. ఈ విషయాన్ని Senior Amazon technical expert Abby Fuller తెలిపారు. పూర్తి వివరాల్లోకెళితే...

Advertisement

ఇండియాలో లాంచ్ అయిన LG V40 ThinQ ధర ఎంతో తెలుసా...?

కొత్త నంబరుతో సిమ్

ఇంతకీ విషయం ఏంటంటే ఈమె ఈ మధ్య ఓ కొత్త నంబరుతో సిమ్ తీసుకుంది. ఆ నంబరు మీద వాట్సప్ క్రియేట్ చేసుకుంది. అయితే ఆ తర్వాత ఆమెకు అనుకోని షాక్ తగిలింది. తెలియని నంబర్ల నుంచి అమె వాట్సప్ లోకి అనేక మెసేజ్ లు వచ్చి పడ్డాయి.

 

 

Advertisement
కారణం

ఆ నంబరు ఇంతకుముందు ఎవరైనా వాడి ఉంటే దానికి వాట్సప్ యాడ్ అయి ఉంటే ఆటోమేటిగ్గా మెసేజ్ లు వస్తాయట. వేరేవారు వాడిన వాట్సప్ అకౌంట్ మీరు తీసుకున్న నంబరులో నిక్షిప్తం అయి ఉంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ మెసేజ్ లు వస్తాయని వాట్సప్ తెలిపింది.

వాట్సప్ కి ఈ విషయం తెలుసు

వాట్సప్ ఎన్ని రకాల సెక్యూరిటీ ఆప్సన్లు ఇచ్చినప్పటికీ ఈ ఇష్యూ మీద మాత్రం ఫలితాలను రాబట్టలేకపోతోంది. కాకుంటే 30 రోజుల తర్వాత డేటాను ఆటోమేటిగ్గా డిలీట్ అయ్యే సదుపాయం మాత్రం కల్పించింది.

వాట్సప్ ఏం చెబుతోంది.

ఎవరైనా స్నేహితుల పాత నంబర్లు ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేసుకోవాలని చెబుతోంది. నంబరు మారిన వెంటనే వారు పాత నంబరును మొబైల్ నుంచి డిలీట్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తవని వాట్సప్ తెలిపింది.

Best Mobiles in India

English Summary

WhatsApp – Are You Getting Someone Elses Messages? More News at Gizbot Telugu