ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఇంక వాట్సాప్ పని చేయదు... మీది ఉందేమో చూడండి


గత కొన్ని సంవత్సరాలుగా వాట్సాప్ ఒక సాధారణ మెసెంజర్ యాప్ నుండి ఆల్ ఇన్ వన్ కమ్యూనికేషన్ సొల్యూషన్ వరకు ఖ్యాతి పొందింది. ఈ యాప్ ప్రతి వారం పొందే స్థిరమైన అప్డేట్ల కారణంగా మాత్రమే ఇది బాగా పాపులర్ అయింది. క్రొత్త అప్డేట్లు మరియు ఫీచర్లను పాత ఫోన్‌లు పొందలేవు.

Advertisement

అయినప్పటికీ వాట్సాప్ ప్రతి సంవత్సరం వారికి మద్దతునిస్తూనే ఉంది. 2020 సంవత్సరం సమీపిస్తున్నందున ఈ క్యాలెండర్ లో ఫిబ్రవరి 1 2020 తర్వాత వాట్సాప్‌కు మద్దతునివ్వని మరిన్ని ఫోన్‌ల జాబితాను వాట్సాప్ విడుదల చేసింది.

 

లాంగ్ టర్మ్ ప్యాక్‌లను తొలగించిన DTH ఆపరేటర్లు

Advertisement

పాత స్మార్ట్‌ఫోన్‌ల మద్దతును తొలగించినందుకు ఈసారి వాట్సాప్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ 2020 లో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల పాత మొబైల్ ఫోన్లలో పనిచేయడం ఆగిపోతుంది. ఈ విండోస్ ఫోన్‌లలో మొదటిది డిసెంబర్ 31, 2019 తర్వాత లాక్ అవుతుంది. ఫిబ్రవరి 1, 2020 నుండి iOS 8తో రన్ అవుతున్న ఏదైనా ఐఫోన్ మరియు వెర్షన్ 2.3.7 లేదా అంతకంటే ఎక్కువ పాత వాటితో రన్ అవుతున్న ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది.

 

QR కోడ్‌ ద్వారా వెబ్‌పేజీని షేర్ చేయడం ఎలా?

అలాగే iOS డివైస్లలో కూడా వాట్సాప్ పని చేయడం ఆగిపోతున్నది. ఐఓఎస్ 8 మరియు అంతకంటే పాత OSలను కలిగి వున్న అన్ని ఐఫోన్‌లు ఫిబ్రవరి 1, 2020 నుండి తమ సర్వీసుకు మద్దతు ఇవ్వడం ఆపివేస్తాయని వాట్సాప్ తెలిపింది. ఈ ఐఫోన్ మోడళ్ల వినియోగదారులు ఈ పరికరాల్లో కొత్త అకౌంట్లను క్రీయేట్ చేసే సామర్థ్యాన్ని చాలా కాలం నుండి కోల్పోయారు. ఇప్పుడు అవి ఇకపై వాట్సాప్ యాప్ ను ఉపయోగించలేవు.

 

ట్విట్టర్‌లో కొత్త ఫీచర్!!!అది ఏమిటో చూడండి...

విండోస్ ఫోన్ వినియోగదారులకు కూడా మరొక చేదు వార్త ఉంది. ఈ ప్లాట్‌ఫాం చాలాకాలంగా నశించినట్లుగా పరిగణించబడుతుంది. అయితే మైక్రోసాఫ్ట్ ఇటీవల OS మరియు వాట్సాప్ కోసం మద్దతును వదులుకున్నట్లు ప్రకటించింది. మీరు విండోస్ ఫోన్‌లో వాట్సాప్ ఉపయోగిస్తుంటే కనుక అది జనవరి 1, 2020 నుండి పనిచేయడం ఆగిపోతుంది.

అందువల్ల మీరు ఈ పాత ఫోన్‌లలో దేనినైనా ఉపయోగిస్తుంటే కనుక మీరు సాఫ్ట్‌వేర్ యొక్క ఇటీవలి సంస్కరణలతో కొత్త హ్యాండ్‌సెట్‌కు అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. ప్రస్తుతం అమ్మకంలో ఉన్న ప్రతి ఐఫోన్ మోడల్స్ iOS 12తో రన్ అవుతున్నాయి. అలాగే ఐఫోన్ 6 ఎస్ వంటి పాత పరికరాల్లో కనీసం 3 సంవత్సరాలు వాట్సాప్‌కు మద్దతు ఇవ్వాలి. Android తో మీరు ఎంచుకోవడానికి వందలాది ఎంపికలు ఉన్నాయి. విండోస్ ఫోన్ వినియోగదారులు మాత్రం ఖచ్చితంగా వారు ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌ల iosకు వెళ్లాలి.

 

 

Best Mobiles in India

English Summary

WhatsApp To Longer Support On Older iPhones And Android Phones