2019లో యాపిల్ ఏం లాంచ్ చేయబోతుందో తెలుసా?

యాపిల్ బ్రాండ్ నుంచి ప్రతి ఏటా కొత్త ఉత్పత్తులు మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉంటాయి. యాపిల్ లాంచ్ చేసే ఉత్పత్తుల్లో ఐఫోన్‌లదే సింహభాగం అయినప్పటికి అప్పుడప్పుడు ఐప్యాడ్‌ల పాత్ర కూడా ఉంటుంది.


యాపిల్ బ్రాండ్ నుంచి ప్రతి ఏటా కొత్త ఉత్పత్తులు మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉంటాయి. యాపిల్ లాంచ్ చేసే ఉత్పత్తుల్లో ఐఫోన్‌లదే సింహభాగం అయినప్పటికి అప్పుడప్పుడు ఐప్యాడ్‌ల పాత్ర కూడా ఉంటుంది.

Advertisement

2019లో షియోమి లాంచ్ చేయబోతున్న ఫోన్లు ఇవే...!

రెండు కొత్త వెర్షన్ ఐప్యాడ్‌లను

2019కిగాను రెండు కొత్త వెర్షన్ ఐప్యాడ్‌లను యాపిల్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ కొత్త ఐప్యాడ్‌లు ఐఫోన్ కంటే ముందుగానే మార్కెట్లో లాంచ్ అవుతాయట. డిజీటైమ్స్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం తైవాన్‌కు చెందిన టచ్ ప్యానల్ తయారీదాలుదైన జనరల్ ఇంటర్‌ఫేస్ సొల్యూషన్ (జీఐఎస్) ఇంకా టీపీకే హోల్డింగ్‌లు, ఈ కొత్త ఐప్యాడ్ సిరీస్‌కు సంబంధించి ప్యానల్స్‌ను సమకూర్చబోతున్నాయి.

Advertisement
2019 ప్రధమాంకంలో రెండు ఎంట్రీ లెవల్ ఐప్యాడ్ డివైస్‌లను

2019 ప్రధమాంకంలో రెండు ఎంట్రీ లెవల్ ఐప్యాడ్ డివైస్‌లను యాపిల్ లాంచ్ చేయబోతున్నట్లు ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఈ లైనప్‌లో భాగంగా 5వ తరం ఐప్యాడ్ మినీతో పాటు ఎంట్రీ లెవల్ ఐప్యాడ్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. వీటికి సంబంధించిన స్పెక్స్ రివీల్ కావల్సి ఉంది. యాపిల్ తీసుకురాబోతోన్న కొత్త ఐప్యాడ్ డివైస్‌లకు సంబంధించి 40 శాతం వరకు టచ్ ప్యానల్స్‌ను జనరల్ ఇంటర్‌ఫేస్ సొల్యూషన్ సమకూర్చబోతోందట. మిగలిన 60 శాతం ప్యానల్స్‌ను టీపీకే అలాను ఓ-ఫిల్మ్ టెక్నాలజీలు సమకూర్చనున్నాయట. యాపిల్ తన ఐప్యాడ్ మినీ మోడల్‌ను చివరిగా 2015లో అప్‌డేట్ చేయటం జరిగింది.

త్వరలో లాంచ్ కాబోతోన్న ఐప్యాడ్ మోడల్స్‌ను

త్వరలో లాంచ్ కాబోతోన్న ఐప్యాడ్ మోడల్స్‌ను 9.7 ఇంచ్ డిస్‌ప్లేలకు బదులుగా 10-ఇంచ్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయట. ఇందుకు అవసరమైన ఎక్కువ మొత్తం ఎల్‌ఈడి డిస్‌ప్లేలను జపాన్‌కు బదులుగా కొరియా కంపెనీల నుంచి యాపిల్ తీసకుంటోందట. యాపిల్ తన చివరి ఐఫోన్ మోడల్‌ను అక్టోబర్ 2018లో విడుదల చేసింది. ఐప్యాడ్ ప్రో (2018) పేరుతో లాంచ్ అయిన ఈ డివైస్ నవంబర్ నుంచి మార్కెట్లో లభ్యమవుతోంది.

ఐప్యాడ్ టచ్ ఎంపీ3 ప్లేయర్

ఈ ఏడాదికి గాను యాపిల్ నుంచి లాంచ్ కాబోతోన్న కొత్త ఉత్పత్తుల జాబితాలో ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లే కాకుండా 7వ తరం ఐప్యాడ్ టచ్ ఎంపీ3 ప్లేయర్ కూడా ఉండబోతోందట.

 

 

Best Mobiles in India

English Summary

Apple may launch these new products before the 2019 iPhones.To Know More About Visit telugu.gizbot.com