CES 2018లో కనువిందు చేసిన కొత్త టెక్నాలజీ విశేషాలు...


లాస్‌వేగాస్ వేదికగా జరుగుతోన్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2018, కొత్త టెక్నాలజీతో కనువిందు చేస్తోంది. జనవరి 9, 2018న ప్రారంభమైన ఈ టెక్నాలజీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ జనవరి 21, 2018తో ముగుస్తుంది. ఈ 4 రోజల టెక్నాలజీ ప్రదర్శనలో భాగంగా కొత్త తరహా కంప్యూటింగ్ డివైస్‌లతో పాట వినూత్న గాడ్జెట్‌లను ప్రముఖ కంపెనీలు ఆవిష్కరించాయి. సీఈఎస్ 2018లో చోటుచేసుకున్న పలు అత్యుత్తమ ఆవిష్కరణల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Set Top Box కొనుగోలు చేయాలనుకుంటున్నారా, మీ కోసమే ఈ బెస్ట్ డీల్స్ !

లెనోవో స్మార్ట్ డిస్‌ప్లేలు (Lenovo Smart Displays)

సీఈఎస్ 2018లో భాగంగా చైనా కంప్యూటింగ్ దిగ్గజం లెనోవో సరికొత్త స్మార్ట్ డిస్‌ప్లేలను లాంచ్ చేసింది.

గూగుల్ కంపెనీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడిన ఈ ఫుల్ హెచ్‌డి టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేల‌లో గూగుల్ అసిస్టెంట్‌ ఫీచర్ ముందుగానే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా లేటెస్ట్ వెదర్ అప్‌డేట్‌లతో పాటు ట్రాఫిక్, మీటింగ్ షెడ్యూల్స్ వంటి వివరాలను తెలసుకునే వీలుంటుంది. గూగల్ డ్యుయలో యాప్ ద్వారా వీడియో కాల్స్ చేసకునే వీలుంటుంది. క్వాల్కమ్ ఎస్‌డీఏ 624 సాక్ ఆధారంగా అభివృద్ధి చేయబడిన క్వాల్కమ్ హోమ్ హబ్ ప్లాట్‌ఫామ్ పై ఈ డివైస్ రన్ అవుతుంది. సాప్ట్ గ్రే ఇంకా న్యాచురల్ బాంబో కలర్ వేరియంట్‌లలో ఈ డిస్‌ప్లేలు అందుబాటులో ఉంటాయి.

హెచ్‌టీసీ వైవ్ ప్రో (HTC Vive Pro)

సీఈఎస్ 2018లో భాగంగా తైవాన్ బ్రాండ్ హెచ్‌టీసీ, ‘వైవ్ ప్రో' (Vive Pro) పేరతో సరికొత్త ప్రొఫెషనల్ గ్రేడ్ వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్‌ను అనౌన్స్ చేసింది. ఈ హెడ్‌సెట్, 3కే రిసల్యూషన్ క్వాలిటీతో విజువల్స్‌ను అందిస్తుంది. వైవ్ ప్రోలో పొందుపరిచిన డ్యయల్ ఓఎల్ఈడి డిస్‌ప్లేలు 615పీీపీఐతో బూట్ అవుతాయి.

సోనీ ఓఎల్ఈడి టీవీ (Sony OLED TV)

తన మొదటి 4కే ఓఎల్ఈడి టీవీ మార్కెట్లో విజయం సాధించటంతో మంచి జోష్ మీదున్న సోనీ, సీఈఎస్ 2018లో భాగంగా AF8 పేరుతో 2018 4కే ఓఎల్ఈడి సిరీస్‌ను లాంచ్ చేసింది. 4కే హెచ్‌డీఆర్ ఎక్స్1

ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో పాటు ఎకౌస్టిక్ సర్ఫేస్ టెక్నాలజీ పై స్పందించగలిగే ఈ 4కే టీవీలు 55 ఇంకా 65 ఇంచ్ డిస్‌ప్లే వేేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. స్టాండర్డ్ హెచ్‌డీఆర్10, హెచ్‌ఎల్‌జీ ఫార్మాట్స్, డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ వంటి విప్లవాత్మక ఫీచర్లను సోనీ ఈ టీవీల్లో పొందుపరిచింది.

రాకిడ్ ఏఆర్ గ్లాస్ (Rokid AR Glass)

చైనాకు చెందిన ప్రముఖ ఆర్టిషీయల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కంపెనీ రాకిడ్, సీఈఎస్ 2018లో భాగంగా రాకిడ్ గ్లాస్ పేరుతో విప్లవాత్మక ఆగ్‌మెంటెడ్ రియాల్టీ స్మార్ట్ గ్లాస్‌లను అనౌన్స్ చేసింది. బ్యాటరీల పై రన్ అయ్యే

ఈ ఏఆర్ గ్లాస్‌లో కంప్యూటింగ్ నిమిత్తం ఓ ఇంటర్నల్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేయటం జరిగింది. బ్లుటూత్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ ద్వారా ఈ స్మార్ట్ కళ్లద్దాలను స్మార్ట్‌ఫోన్ అలానే ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసుకునే వీలుంటుంది.

థర్డ్‌ఐ ఎక్స్1 స్మార్ట్ గ్లాస్ (ThirdEye X1 Smart Glass)

ఆగ్‌మెంటెడ్ రియాల్టీ టెక్నాలజీ విభాగంలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకన్న ThirdEye Gen Inc, సీఈఎస్ 2018లో భాగంగా ఎక్స్1 పేరుతో ఓ ప్రత్యేకమైన స్మార్ట్ గ్లాస్ డివైస్‌ను అనౌన్స్ చేసింది. అత్యాధునిక సెన్సార్స్ అలానే చిప్‌లతో ప్యాక్ అయి ఉన్న ఈ డివైస్ ద్వారా 1280 x 720 పిక్సల్ సామర్థ్యం గల బైనాక్యులర్ డిస్‌ప్లేను ఆస్వాదించే వీలుంటుంది. ఈ గ్లాస్ ద్వారా 90 అంగుళాల స్ర్కీన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసే వీలుంటుంది. ఈ స్మార్ట్‌గ్లాస్ ఆఫర్ చేసే మూడు స్ర్కీన్ల ఇంటర్‌ఫేస్ పై కావల్సిన కంటెంట్‌ను యూజర్ యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. తలను అటూఇటూ రొటేట్ చేస్తుండటం ద్వారా ఒక్కో స్ర్కీన్‌ను యాక్సెస్ చేసుకునే వీలుంటుంది.

లెనోవో మిక్స్ 360 (Lenovo Miix 630)

సీఈఎస్ 2018లో భాగంగా చైనా కంప్యూటింగ్ దిగ్గజం లెనోవో Miix 630 పేరుతో 2 ఇన్ 1 విండోస్ 10 హైబ్రీడ్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్ పై ఈ డివైస్ రన్ అవుతుంది. విండోస్ ఇంక్ సపోర్టింగ్‌తో కూడిన డిజిటల్ పెన్‌ ద్వారా ఈ ల్యాపీని ఆపరేట్ చేసుకునే వీలుంటుంది.

ఇంటెల్ అటానమస్ హెలికాఫ్టర్ (Intel autonomous helicopter)

సీఈఎస్ 2018లో భాగంగా కంప్యూటర్ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ వోలోకాప్టర్ వీసీ200 పేరుతో 18 రోటర్ ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. జర్మనీకి చెందిన 50 మంది ఇంజినీర్లు ఓ అంకుర సంస్థగా ఏర్పడి ఈ ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేసారు. వోలోకాప్టర్ 2ఎక్స్ గాలిలో 30 నిమిషాల పాటు ఎగరగలదు. ఈ వ్యవధిలో 17 మైళ్ల లక్ష్యాన్ని చేధించగలుగుతుంది.

లెనోవో థింక్‌ప్యాడ్ ఎక్స్1 (Lenovo ThinkPad X1)

సీఈఎస్ 2018లో భాగంగా చైనా కంప్యూటింగ్ దిగ్గజం లెనోవో తన థింక్‌ప్యాడ్ సిరీస్ నుంచి సరికొత్త ఎక్స్1 నోట్‌బుక్‌ను అనౌన్స్ చేసింది. 13 అంగుళాల స్ర్కీన్‌తో వచ్చే ఈ 2 ఇన్ 1 టాబ్లెట్ 3,000 x 2,000 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో పూర్తిస్థాయి హెచ్‌డీఆర్ సపోర్ట్‌ను ఆఫర్ చేయగలుగుతుంది. ఇంటెల్‌చే డిజైన్ చేయబడిన 8వ తరం ఐ7 ప్రాసెసర్ పై ఈ ల్యాపీ రన్ అవుతుంది. 9 గంటల బ్యాటరీ బ్యాకప్ ఈ డివైస్‌కు మరో హైలైట్‌గా నిలుస్తుంది. పెన్ ప్రో ద్వారా ఈ ల్యాప్‌టాప్‌ను ఆపరేట్ చేసుకునే వీలుంటుంది.

కేట్ స్పాడ్ స్మార్ట్‌వాచ్ (Kate Spade smartwatch)

సీఈఎస్ 2018లో భాగంగా లాంచ్ అయిన ఈ స్మార్ట్‌వాచ్ ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతోన్న ఆండ్రాయిడ్ వేర్ డివైస్‌లతో పోలిస్తే చాలా చిన్నదిగానూ ఇదే సమయంలో మరింత స్లిమ్‌గాను ఉంటుంది. ఈ వాచ్ పనితీరు పరంగా కంటే లుక్స్ పరంగా ఆకట్టకుంటుంది. ఈ యాప్‌లో లోడ్ చేసిన ప్రత్యేకమైన యాప్ యూజర్ ప్రస్తుత స్టైల్‌కు అనుగుణంగా వాచ్ ఫేస్‌ను మార్చేస్తుంటుంది. క్వాల్కమ్ 1.3గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ వేర్ 1200 ప్రాసెసర్ పై ఈ వాచ్ రన్ అవుతుంది. మైక్రోఫోన్‌తో పాటు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లు ఈ వాచ్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి.

డిజిటల్ స్టార్మ్ స్పార్క్ (Digital Storm Spark)

ఈ పూర్తిస్థాయి గేమింగ్ డెస్క్‌టాప్‌ ఇంటెల్ జెడ్370 చిప్‌సెట్ ఆధారంగా స్పందిస్తుంది. ఇంటెల్ కోర్-ఐ7 8700కే ప్రాసెసర్‌తో పాటు ఎన్‌విడియా జీటీఎక్స్ 1080 జీపీయూ కాంబినేషన్‌లో ఉండే ఈ చిప్‌సెట్ హైక్వాలిటీ పనితీరును ఆఫర్ చేస్తుంది. ఈ డెస్క్‌టాప్‌లో పొందుపరిచిన ప్రత్యేకమైన లిక్విడ్ కూలింగ్ సిస్టం డివైస్ కూలింగ్ పార్ట్ పై ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India
Read More About: ces 2018 gadgets lenovo htc

Have a great day!
Read more...

English Summary

The CES 2018 has kick-started as usual in Las Vegas with world’s leading tech manufacturers showcasing their latest product updates, new gadgets, and innovations. This year the event starts on January 9 and ends on January 12, 2018.