తగ్గింపు ఆఫర్లతో మొదలైన హువాయి బ్యాండ్ 4 సేల్స్


హువాయి సంస్థ గత వారం ఇండియాలో హువాయి బ్యాండ్ 4 పేరుతో బడ్జెట్ ధరలో తన ఫిట్‌నెస్ బ్యాండ్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఈ బ్యాండ్ 4యొక్క సేల్స్ నేటి నుంచి అంటే ఫిబ్రవరి 1 నుండి ఇండియాలో జరగనున్నట్లు ప్రకటించారు. హువాయి బ్యాండ్ 4 ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని కంపెనీ ప్రకటించింది.

Advertisement

మీరు ఆరోగ్యపరమైన రోజువారీ దినచర్యలను ట్రాక్ చేసే ఉద్దేశ్యంతో సరసమైన ఫిట్‌నెస్ బ్యాండ్ కోసం చూస్తున్నట్లయితే హువాయి యొక్క కొత్త హువాయి బ్యాండ్ 4 ను కొనుగోలు చేయడం చాలా విలువైనదిగా ఉంటుంది. హువాయి సంస్థ ఇప్పుడు తన స్మార్ట్ డివైస్ పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్‌ను జోడించింది.

 

ఫేస్‌బుక్‌లో హిస్టరీని డెలిట్ చేయడానికి కొత్తగా "క్లియర్ హిస్టరీ" ఆప్షన్

Advertisement
ధరల వివరాలు

హువాయి బ్యాండ్ 4 ప్రస్తుతం పరిమిత కాలానికి కేవలం 1,999 రూపాయలకు లభిస్తుంది అని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ పరిమిత కాలం ముగిసిన తరువాత దీని యొక్క ధర రూ.2,099 గా ఉంటుంది. ఇది కేవలం గ్రాఫైట్ బ్లాక్ కలర్‌లో మాత్రమే లభిస్తుంది.

 

 

BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు... రోజువారి 5GB డేటా

సేల్స్ ఆఫర్స్

ఆన్‌లైన్ సేల్స్ లో భాగంగా నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో హువాయి బ్యాండ్ 4 సేల్స్ మొదలయినాయి. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో HSBC,ఫెడరల్ బ్యాంక్,యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు మీద కొనుగోలు చేసిన వారికి 10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

 

 

టిక్‌టాక్‌కు పోటీగా గూగుల్ షార్ట్ వీడియో యాప్ "టాంగి"

స్పెసిఫికేషన్స్

హువాయి బ్యాండ్ 4 ప్రో స్మార్ట్ డివైస్ హృదయ స్పందన సెన్సార్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ స్థాయిలను కొలిచే SpO2 సెన్సార్‌ ను కూడా కలిగి ఉంది. హువాయి బ్యాండ్ 4 0.95-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కాంటాక్ట్‌లెస్ పెమెంట్స్ చేయడానికి NFC మద్దతును కూడా అందిస్తుంది.

 

 

టాటా స్కై మల్టీ టీవీ కనెక్షన్‌లకు సువర్ణ అవకాశం

ఫీచర్స్

2.5D గుండ్రని గ్లాస్ మరియు ఒలియోఫోబిక్ కోటింగ్ తో కలర్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో ప్రీలోడ్ చేయబడిన హువాయి బ్యాండ్ 4 EMUI ద్వారా రన్ అవుతుంది. నావిగేషన్‌ను అనుమతించడానికి చిన్ వద్ద దీర్ఘచతురస్రాకార బటన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫిట్నెస్ బ్యాండ్ 91mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఒక ఛార్జీ మీద తొమ్మిది రోజుల వరకు పనిచేస్తుంది. ఇది ఎటువంటి USB-A పోర్టును సపోర్ట్ చేసే USB ప్లగ్ ద్వారా ఛార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది.

మానిటర్స్

ఫిట్‌నెస్ బ్యాండ్‌లోని ఆరోగ్య సంబంధిత ఫీచర్లలో హృదయ స్పందన మానిటర్ మరియు స్లీప్ మోడ్ డిటెక్టర్ ఉన్నాయి. ఇవి 6 సాధారణ నిద్ర సంబంధిత సమస్యలను గుర్తించగలవు. హువాయి యొక్క యాప్ ఈ సమస్యలకు 200 సంభావ్య పరిష్కారాలను అందించగలదు మరియు మీరు బాగా నిద్రపోవడానికి ఇది సహాయపడుతుందని పేర్కొంది. ఫిట్‌నెస్ బ్యాండ్‌లో అవుట్డోర్ రన్, ఇండోర్ రన్, సైక్లింగ్, ఫ్రీ ట్రైనింగ్, రోయింగ్ మరియు ప్రీసెట్ వర్కౌట్ మోడ్‌లుగా అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English Summary

Huawei Band 4 Sales Live on Flipkart: Price,Offers,Features