Samsung Galaxy Tab S6 5G ,అదిరిపోయే ఫీచర్లు ఇవే!


దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ మేకర్ శామ్‌సంగ్ గత సంవత్సరం 2019 లోనే తన 5G స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇప్పుడు ఇది 5G టాబ్లెట్‌తో అందరి ముందుకు వస్తున్నది. ప్రపంచం మొత్తం మీద సామ్‌సంగ్ టాబ్లెట్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం అందరు 5G మీద మక్కువను పెంచుకుంటున్నందున 5G డివైస్సులను మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

గెలాక్సీ టాబ్ S6 5G ధర & సేల్స్

ప్రపంచంలోని మొట్టమొదటి 5G టాబ్లెట్‌ను దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ సంస్థ ప్రకటించింది. గెలాక్సీ టాబ్ S6 5Gటాబ్లెట్ యొక్క సేల్స్ కొరియాలో ఈ రోజు అంటే జనవరి 30 నుండి మొదలు అవుతున్నాయి. శామ్‌సంగ్ ప్రకారం గెలాక్సీ టాబ్ S6 5G టాబ్లెట్ 999,900 won ధర లేబుల్‌తో వస్తుంది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ 60,280 రూపాయలు.

 

 

యూట్యూబ్‌ ద్వారా డబ్బును సంపాదించడం ఎలా? సులభమైన చిట్కాలు

Advertisement
స్పెసిఫికేషన్స్

గెలాక్సీ టాబ్ S6 5G టాబ్లెట్ యొక్క ఫీచర్ల విషయానికొస్తే సామ్‌సంగ్ యొక్క సరికొత్త 5G టాబ్లెట్ 10.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో 1,600 x 2,560 పిక్సల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది సుమారు 420 గ్రాముల బరువును కలిగి ఉండి డాల్బీ అట్మోస్ మద్దతుతో AKG-ట్యూన్డ్ క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుంది.

 

 

Samsung Galaxy A51 రిలీజ్... లాంచ్ ఆఫర్స్ ఇవే

గెలాక్సీ టాబ్ S6 5G శామ్‌సంగ్ యొక్క స్మార్ట్ Sపెన్‌కు కూడా మద్దతును అందిస్తుంది. సామ్‌సంగ్ 5G టాబ్లెట్‌ కేవలం ఒకే ఒక 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌తో మౌంటెన్ గ్రే కలర్ లో మాత్రమే లభిస్తుంది.

 

 

1.5TB అదనపు డేటా మరియు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లో డిస్కౌంటులతో ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ఫీచర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ S6 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 SoC చేత రన్ అవుతు 7,040 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ప్రపంచ మార్కెట్‌లో మళ్ళి మొదటి స్థానాన్ని అందుకోవడానికి ఇప్పుడు శామ్‌సంగ్ తన 5G పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి కృషి చేస్తోంది. కంపెనీ ప్రస్తుతం గెలాక్సీ S10 5G, నోట్ 10 5G, మరియు A90 5G స్మార్ట్‌ఫోన్‌ల జాబితాతో పాటుగా గెలాక్సీ టాబ్ S6 5G పరికరాల విక్రయాలను జరుపుతున్నది.

 

 

4G, ఆండ్రాయిడ్ ఫీచర్లతో లాంచ్ అయిన Ather 450X ఎలక్ట్రిక్ స్కూటర్

శామ్‌సంగ్ 5G సేల్స్

2019 సంవత్సరంలో శామ్‌సంగ్ ప్రపంచవ్యాప్తంగా 6.7 మిలియన్ 5 జి ఫోన్‌ల ఎగుమతులతో 35.8 శాతం వాటాతో గ్లోబల్ 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నెంబర్ 2 ప్లేయర్‌గా నిలిచింది. అంతేకాకుండా శామ్సంగ్ ఇటీవల గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఇది 2019 సంవత్సరంలో లాంచ్ చేయబడిన శామ్సంగ్ గెలాక్సీ A50కి అప్ డేట్ వెర్షన్.

గెలాక్సీ A51 సేల్స్

గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్‌ యొక్క సేల్స్ ఇండియాలో జనవరి 31 నుండి అన్ని రిటైల్ షాపులు, శామ్‌సంగ్ ఒపెరా హౌస్, శామ్‌సంగ్ ఇ-షాప్ మరియు ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా జరగనున్నాయి. గెలాక్సీ A51 యొక్క 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ రూ.23,999 ధరతో వస్తుంది. ఇది బ్లూ, వైట్, బ్లాక్ ప్రిజం క్రష్ రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అమెజాన్ పేపై వినియోగదారులు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Best Mobiles in India

English Summary

Samsung Galaxy Tab S6 5G Tablet Launched: Price And Specifications