Vu Premium TVs: తక్కువ ధరలో గొప్ప ఆండ్రాయిడ్ ఫీచర్స్ టీవీలు


Vu టెక్నాలజీస్ తన ప్రీమియం టీవీ సిరీస్ పరిధిలో రెండు కొత్త స్మార్ట్ టీవీలను ఇండియాలో విడుదల చేసింది. ఈ సంస్థ యొక్క కొత్త టీవీలు అమ్మకానికి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో ప్రవేశపెట్టింది. అలాగే వాటిని Vu యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అమ్మకానికి ఉంచింది.

Advertisement

Vu ప్రీమియం యొక్క కొత్త టీవీలు ప్రస్తుతం రెండు మోడళ్లలో లభిస్తాయి. అవి వరుసగా 32-అంగుళాల మరియు 43-అంగుళాలను కలిగి ఉండి ఈ టీవీల రెండింటిలో డాల్బీ ఆడియో మరియు డిటిఎస్ స్టూడియో సౌండ్ ఇంటిగ్రేషన్ ఫీచర్లను కలిగి ఉంటాయి.

 

 

Tata Sky Binge: ఒక నెల పాటు ఫ్రీ ట్రయల్ సర్వీస్

Advertisement

కొత్త స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ టీవీ 9 పై ఆధారంగా రన్ అవుతాయి. అలాగే ఇవి అంతర్నిర్మిత గూగుల్ క్రోమ్‌కాస్ట్‌ ఫీచర్ ను కలిగి ఉంటాయి. రెండు మోడల్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్స్టార్, నెట్‌ఫ్లిక్స్ మరియు యూట్యూబ్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) యాప్ లతో ప్రీలోడ్ చేయబడి ఉంటాయి.

 

BSNL Rs.1,999 వార్షిక ప్లాన్‌ : 71 రోజుల పాటు పెరిగిన వాలిడిటీ

ధరల వివరాలు

Vu ప్రీమియం కొత్త టీవీలలో 32-అంగుళాల వెర్షన్ యొక్క ధర రూ.10,999 నుండి మొదలవుతుంది. అలాగే 43-అంగుళాల మోడల్ యొక్క ధర రూ.19,999గా ఉంది. ఈ రెండు కొత్త టీవీలను ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి 10% తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అదనంగా వినియోగదారులు నెలకు రూ.917 నుండి నో-కాస్ట్ ఇఎంఐలను పొందవచ్చు.

 

 

Reliance Jio Rs.2,121 Annual Plan:వార్షిక ప్లాన్‌లలో జియోదే అగ్రస్థానం

Vu ప్రీమియం టీవీ స్పెసిఫికేషన్స్

Vu ప్రీమియం టీవీ 32-అంగుళాల HD ప్యానల్‌ 1366 × 768 పిక్సెల్‌ల రిజల్యూషన్ వద్ద గల డిస్ప్లే ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 20W స్పీకర్ బాక్స్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. 43-అంగుళాల మోడల్ 1920 × 1080 పిక్సెల్ రిజల్యూషన్ మరియు 24W స్పీకర్ బాక్స్‌తో 43-అంగుళాల పూర్తి HD డిస్ప్లే ప్యానల్‌ను కలిగి ఉంటుంది. ప్రీమియం టీవీలు A + గ్రేడ్ హై-ఇంటెన్సిటీ ప్యానెల్స్‌తో వస్తాయి. ఇవి పగటిపూట చూడటానికి కూడా అన్ని అంచులు మరియు మూలల్లో ప్రకాశాన్ని నిర్దేశించబడి ఉంటాయి.

 

 

Samsung Galaxy A71 లాంచ్ ఆఫర్స్ చూడతరమా!!!

ఫీచర్స్

రెండు టీవీలు డాల్బీ డిజిటల్ మరియు డిటిఎస్ స్టూడియో సౌండ్ ఇంటిగ్రేషన్‌తో వస్తాయి. ఇవి సరౌండ్ సౌండ్ తో లీనమయ్యే అనుభవాన్ని అందిస్థాయి. డిస్ప్లే మరియు స్పీకర్ల విషయాలు పక్కన పెడితే ఈ స్మార్ట్ టీవీలు రెండూ ఒకే హార్డ్‌వేర్‌ను కలిగి ఉంటాయి. Vu ప్రీమియం టీవీలు 64బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో 1GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటాయి. ఈ పరికరాల్లో డ్యూయల్ కోర్ GPU కూడా అందుబాటులో ఉంది.

 

 

5G నెట్‌వర్క్‌ కోసం క్వాల్కమ్ యొక్క కొత్త X60 మోడెమ్ చిప్‌

Vu ప్రీమియం కొత్త టీవీలు గూగుల్ ప్లే స్టోర్‌ను కలిగి ఉండడంతో పాటు ఆండ్రాయిడ్ టీవీ 9 పై ఆధారంగా రన్ అవుతాయి. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్, macOS లేదా Windows పరికరాల నుండి వారి కంటెంట్‌ను TV కి ప్రసారం చేయడానికి అనుమతించే ఇంటిగ్రేటెడ్ గూగుల్ Chromecast మద్దతు కూడా ఇందులో ఉంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో వై-ఫై, బ్లూటూత్ V 5.0, రెండు HDMI పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, లాన్, ఆర్‌ఎఫ్, హెడ్‌ఫోన్ జాక్ మరియు ఆప్టికల్ ఆడియో అవుట్ లను కలిగి ఉంటాయి. వీటితో పాటుగా Vu ప్రీమియం టీవీలు గూగుల్ ప్లే, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలను యాక్సెస్ చేయడానికి ఐదు హాట్‌కీలను కలిగి ఉన్న రిమోట్‌ను కలిగి ఉంటాయి.

Best Mobiles in India

English Summary

Vu Launched Its Next Premium TV Lineup: Price, Specifications and Offers