షియోమి Mi రౌటర్ 4C రిలీజ్.... అధిక వేగం, గొప్ప ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫీచర్స్


ప్రముఖ చైనా సంస్థ షియోమి ఇప్పుడు తన Mi రౌటర్ 4C ని ఇండియాలో విడుదల చేసింది. ఈ కొత్త వైర్‌లెస్ రౌటర్ అధిక-పనితీరు గల నాలుగు ఓమ్ని-డైరెక్షనల్ యాంటెన్నాలతో వస్తుంది. ఇది 300Mbps వేగంతో ఇంటర్నెట్ ను అందిస్తుంది. అలాగే ఇది 2.4GHz వై-ఫై బ్యాండ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

ఈ రౌటర్‌ను గత ఏడాది జూలైలో చైనాలో లాంచ్ చేశారు. మొత్తానికి సుమారు 7 నెలల తరువాత ఇప్పుడు ఇది భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. Mi రౌటర్ 4C అనేది 64MB ఆన్‌బోర్డ్ ర్యామ్‌తో మరియు 16MB నార్ ఫ్లాష్ ROMను కలిగి ఉంటుంది. Mi రౌటర్ 4C ని Mi Wi-Fi యాప్ ద్వారా నియంత్రించవచ్చు. అంతేకాకుండా ఇది బ్యాండ్‌విడ్త్ ఆప్టిమైజేషన్ టూల్స్ మరియు పేరెంటల్ కంట్రోల్స్ వంటి లక్షణాలతో వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్... ఫీచర్స్ ఇవే!!!

Mi రౌటర్ 4C ధరల వివరాలు

Mi రౌటర్ 4C యొక్క ధర ఇండియాలో 999 రూపాయలుగా ఉంది. ఇది ఒకేఒక వైట్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ Mi రౌటర్ 4C ని Mi.com ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీనిని 3 రోజుల లోపు డెలివరీ చేయబడుతుంది. వినియోగదారుడు వన్డే డెలివరీ పొందాలనుకుంటే అదనంగా రూ.49లు చెల్లించవలసి ఉంటుంది.

గ్లాన్స్ లాక్‌స్క్రీన్: షాపింగ్‌ కంటెంట్ ప్లాట్‌ఫాంతో అద్భుతమైన ఫీచర్

ఫీచర్స్

Mi రౌటర్ 4C యొక్క ఫీచర్ల విషయానికి వస్తే ఇది 2.4GHz వై-ఫై 802.11 ను కలిగి ఉండి 300Mbps వేగంతో ఇంటర్నెట్ ను అందించగలదు. ఇది నాలుగు ఓమ్ని-డైరెక్షనల్ యాంటెన్నాను, మీడియాటెక్ MT7628N ప్రాసెసర్, 64MB DDR2 RAM మరియు 16MB నార్ ఫ్లాష్ ROMలను కలిగి ఉండి 195x178.9x107mm కొలతల పరిమాణంను కలిగి ఉంటుంది. ఇది Mi Wi-Fi యాప్,ఆండ్రాయిడ్ మరియు iOS ఫోన్‌లకు అనుకూలంగా ఉంటుంది.

ఫాస్ట్‌ట్యాగ్‌ యాక్టివేషన్ పేరుతో రెచ్చిపోతున్న మోసగాళ్ళు

సాధారణ రౌటర్ల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా Mi రూటర్ 4C ద్వారా 64 డివైస్ లను ఒకేసారి కనెక్ట్ చేయగలదని షియోమి సంస్థ పేర్కొంది. రూటర్ సెట్టింగులను రిమోట్‌గా వీక్షించడానికి మరియు నిర్వహించడానికి Mi Wi-Fi యాప్ మీకు సహాయపడుతుంది. ఇందులో QoS (క్వాలిటీ ఆఫ్ సర్వీస్) టూల్ కూడా ఉంది. ఇది అవసరానికి అనుగుణంగా బ్యాండ్‌విడ్త్‌ను నిర్వహించడానికి మరియు కేటాయించడంలో మీకు సహాయపడుతుంది. పిల్లలు చూడగలిగే మరియు చూడలేని వాటిని నిర్వహించడానికి యాప్ పేరెంటల్ నియంత్రణలను కూడా అందిస్తుంది.

Most Read Articles

Best Mobiles in India

Have a great day!
Read more...

English Summary

Xiaomi Launched Mi Router 4C in India: Price, Features and More