మీ మొబైల్ మొత్తాన్ని బ్యాకప్ తీయడం ఎలా ?


ఇపుడు స్మార్ట్‌ఫోన్లు చిన్నసైజ్‌ డేటా సెంటర్లుగా మారిపోయాయి. విలువైన ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు, అప్లికేషన్లు, కాంటాక్టులు, కాల్‌ లాగ్స్‌, సెట్టింగులు వంటి పెద్ద మొత్తంలో డేటా ప్రతీ ఫోన్లోనూ నిక్షిప్తమై ఉంటోంది. అంత కీలకమైన డేటాని ఎప్పటికప్పుడు బ్యాకప్‌ తీసుకోపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని డేటాని బ్యాకప్‌ తీసుకోవడానికి వివిధ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా మీరు మీ డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు.

లీకయిన ఆపిల్ కొత్త ఐఫోన్ల ధరలు, ఈవెంట్ ఎప్పుడంటే ?

రామ్‌ మేనేజర్‌

దీని ద్వారా మీరు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ని పూర్తిస్థాయిలో బ్యాకప్‌ తీసుకోవచ్చు. రామ్‌ మేనేజర్‌ అనేది గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభించే ఓ అప్లికేషన్‌. దీని సాయంతో ప్రస్తుతం మీ ఫోన్లో ఇన్‌స్టాల్‌ చెయ్యబడి ఉన్న ఆండ్రాయిడ్‌ రామ్‌ మొత్తాన్నీ ఉన్నది ఉన్నట్లు పూర్తిగా బ్యాకప్‌ తీసుకోవచ్చు. మీ ఫొటోలు, వీడియోలు, కాంటాక్టులు, ఫోన్‌ సెట్టింగులు, మీరు ఇన్‌స్టాల్‌ చేసిన అప్లికేషన్లు, కాల్‌ లాగ్స్‌, మెసేజ్‌లు, నెట్‌వర్క్‌ సెట్టింగులు ఇలా సమస్త సమాచారం ఒకటే ఫైల్‌గా బ్యాకప్‌ తీయబడుతుంది. ఈ అప్లికేషన్‌ వాడాలంటే మీ ఫోన్‌ తప్పనిసరిగా రూట్‌ చెయ్యబడి ఉండాలి.

టైటానియం బ్యాకప్‌

మీ ఫోన్‌ని బ్యాకప్‌ తీసుకోవడానికి అందుబాటులో ఉన్న రెండవ అతి శక్తివంతమైన సదుపాయం గూగుల్‌ ప్లేస్టోర్‌లోనే లభించే టైటానియం బ్యాకప్‌ అనే అప్లికేషన్‌ని వాడడం. ఇది మన ఫోన్లో ఉన్న అప్లికేషన్ల ‘ఎపికె ఫైళ్ల'ని పూర్తిస్థాయిలో బ్యాకప్‌ తీయడం మాత్రమే కాదు, వాటికి సంబంధించిన అప్లికేషన్‌ డేటాని కూడా బ్యాకప్‌ తీస్తుంది. ఫోన్‌ని ఫ్యాక్టరీ రీసెట్‌ చేశాక ఇదే అప్లికేషన్‌ ద్వారా తిరిగి ఆ డేటా మొత్తాన్నీ రీస్టోర్‌ చేసుకోవచ్చు. దీన్ని వాడాలన్నా కూడా మీ ఫోన్‌ రూట్‌ చెయ్యబడి ఉండాలి.

గూగుల్‌ బ్యాకప్‌ అండ్‌ సింక్‌

ఇది కేవలం మీ ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేయబడి ఉన్న అప్లికేషన్ల పేర్లు, కాంటాక్టులు, సెట్టింగుల వంటివి మాత్రమే బ్యాకప్‌ తీస్తుంది. ఫ్యాక్టరీ రీసెట్‌ చేసిన తర్వాత మళ్లీ గూగుల్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అయితే గతంలో చివరిసారిగా ఎప్పుడు బ్యాకప్‌ తీయబడిందో చూపిస్తూ ఆ డేటాని రీస్టోర్‌ చేయమంటారా అని కోరుతుంది. దాన్ని ఎంపిక చేసుకున్న వెంటనే గతంలో మీరు వాడిన అప్లికేషన్ల పేర్లు మళ్లీ గుర్తుంచుకోవలసిన అవసరం లేకుండా అవన్నీ అప్పటికప్పుడు ఒక దాని తర్వాత మరొకటి గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి డౌన్‌లోడ్‌ అవుతూ ఉంటాయి.

ఫొటోల బ్యాకప్‌

మీ ఫొటోలు అస్సలు మిస్‌ అవకూడదు అనుకుంటే మీ ఆండ్రాయిడ్‌ ఫోన్లో ‘గూగుల్‌ ఫొటోస్‌' అనే అప్లికేషన్‌ తప్పనిసరిగా ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఇది మీ ఫోన్‌లో ఉన్న ఫొటోలన్నింటితో పాటు, ఎప్పటికప్పుడు కొత్తగా కేప్చర్‌ చేయబడే ఫొటోలను కూడా గూగుల్‌ సంస్థ ఉచితంగా అందిస్తున్న ‘గూగుల్‌ ఫొటోస్‌' సర్వీస్‌లోకి అప్‌లోడ్‌ చేస్తుంది.

రూట్‌ చెయ్యబడని వారికి

మీ ఫోన్‌ రూట్‌ చెయ్యబడి లేకపోతే.. ‘బ్యాకప్‌ యువర్‌ మొబైల్‌' అనే అప్లికేషన్‌ వాడడం ద్వారా మీ ఫోన్లో ఉన్న అతి కీలకమైన డేటాని బ్యాకప్‌ తీసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ ద్వారా మీ ఫోన్‌ కాంటాక్టులు, సిస్టమ్‌ సెట్టింగులు, సెక్యూర్‌ సెట్టింగులు, ఫోన్లో ఇన్‌స్టాల్‌ అయి ఉన్న అప్లికేషన్ల జాబితా, ఎస్‌ఎంఎస్‌ మెసేజ్‌లు, కాల్‌ లాగ్స్‌, యూజర్‌ డిక్షనరీ, కాలెండర్‌ ఈవెంట్స్‌ వంటి డేటా మొత్తాన్నీ మెమరీ కార్డులోకి గానీ, గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌ వంటి క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసుల్లోకి గానీ బ్యాకప్‌ తీసుకోవచ్చు.

మెసేజ్‌లకు మాత్రమే

ఎస్‌ఎంఎస్‌ మెసేజ్‌లను, కాల్‌ లాగ్స్‌ని మాత్రమే బ్యాకప్‌ తీసుకోదలుచుకుంటే ‘ఎస్‌ఎంఎస్‌ బ్యాకప్‌ అండ్‌ రీస్టోర్‌' అనే అప్లికేషన్‌ని ప్రయత్నించవచ్చు. వివిధ బ్యాంకింగ్‌ లావాదేవీలు, ఇది ఒక షెడ్యూల్‌ ప్రకారం డేటాని ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా బ్యాకప్‌ తీసే సామర్థ్యం కూడా ఉంది.


Honor 10

Have a great day!
Read more...

English Summary

How to Back Up Your Android Smartphone more news at Gizbot Telugu