గూగుల్ డుయో ద్వారా డూడుల్‌ మెసేజ్,నోట్స్ లను పంపడం ఎలా?


ఆండ్రాయిడ్ మరియు గూగుల్‌లో అందుబాటులో ఉన్న ఉత్తమ వీడియో కాలింగ్ యాప్ లలో గూగుల్ డుయో ఒకటి. ఇది ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యాప్ ను అప్ డేట్ చేస్తున్నది. ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ దీని కోసం మరొక కొత్త ఫీచర్‌ను జతచేసింది. ఇందులో భాగంగా వినియోగదారులు ఇతరులకు సెల్ఫ్ నోట్స్ మరియు డూడుల్‌లను పంపడానికి అనుమతిస్తుంది.

Advertisement

గూగుల్ డుయో యొక్క ఈ కొత్త ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ యొక్క స్టోరీ ఫీచర్‌తో సమానంగా ఉంటుంది. ఇది ఎంచుకున్న బ్యాక్ గ్రౌండ్ లో మెసేజ్ ను టైప్ చేయడానికి, ఫాంట్ చేయడానికి మరియు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగానే గూగుల్ డుయోలోని మెసేజ్ 24 గంటలు మాత్రమే చూడటానికి అందుబాటులో ఉంది. ఆ తర్వాత అది ఆటోమ్యాటిక్ గా తొలగించబడుతుంది.

 

 

రోజుకు 5GB డేటా ప్రయోజనంతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

Advertisement

మీరు మీ మెసేజ్ లకు వ్యక్తిగత స్పర్శను జోడించాలనుకుంటే లేదా వాయిస్ లేదా వీడియో మెసేజ్ లను ఉపయోగించకూడదనుకుంటే క్రొత్త టెక్స్ట్ మరియు డూడుల్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ క్రొత్త ఫీచర్లను ఉపయోగించడానికి కింద ఉన్న దశల వారీని అనుసరించండి.

 

 

యూట్యూబ్‌ ద్వారా డబ్బును సంపాదించడం ఎలా? సులభమైన చిట్కాలు

గూగుల్ డుయో ద్వారా టెక్స్ట్ ఎలా పంపాలి

** గూగుల్ డుయో యాప్ ను ఓపెన్ చేసి మీ యొక్క కాంటాక్ట్ జాబితా నుండి ఒకరిని ఎంచుకోండి.

** ఇప్పుడు ఇందులో కుడివైపు దిగువన గల 'మెసేజ్' గుర్తు మీద నొక్కండి.

 

** ఇక్కడ వాయిస్ మరియు వీడియో ఎంపిక పక్కన గల 'నోట్స్' ట్యాగ్‌పై నొక్కండి.

** మీరు పంపవలసిన టెక్స్ట్ మెసేజ్ ను టైప్ చేయడం ప్రారంభించడానికి స్క్రీన్ మీద నొక్కండి. తరువాత 'సెండ్' బటన్ మీద నొక్కండి.

మీరు టెక్స్ట్ మెసేజ్ ను సెండ్ చేయడం కోసం ఫాంట్ శైలి, కలర్ మరియు పరిమాణాన్ని కూడా ఎంచుకోవచ్చని గమనించండి.

 

 

1.5TB అదనపు డేటా మరియు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లో డిస్కౌంటులతో ACT బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

గూగుల్ డుయో ద్వారా డూడుల్‌లను ఎలా పంపాలి

** మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ డుయో యాప్ ను ఓపెన్ చేయండి.

** అందులో కాంటాక్ట్స్ లను ఎంచుకుని కుడి భాగం దిగువవైపున మూలలో ఉన్న 'మెసేజ్' గుర్తుపై నొక్కండి.

** ఇప్పుడు 'నోట్స్' ఎంపికపై నొక్కండి. తరువాత కుడివైపు ఎగువ మూలలో గల 'డూడుల్' చిహ్నాన్ని నొక్కండి.

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

 

** ఇప్పుడు 'నోట్స్' ఎంపికపై నొక్కండి. తరువాత కుడివైపు ఎగువ మూలలో గల 'డూడుల్' చిహ్నాన్ని నొక్కండి.

** మీకు కావలసిన బ్రష్ పరిమాణం, రకం, కలర్ , బ్యాక్ గ్రౌండ్ కలర్ మరియు డూడుల్‌ని ఎంచుకోండి

** మీరు పంపవలసినది క్రియేట్ చేసి 'సెండ్' బటన్ మీద నొక్కండి.

ఒకే మెసేజ్ లో టెక్స్ట్ మరియు డూడుల్ రెండింటినీ కలపడానికి మరియు సరిపోల్చడానికి కూడా గూగుల్ డుయో ఒక ఎంపికను కలిగి ఉంది.

 

Best Mobiles in India

English Summary

Google Duo Now Can Be Used To Send Doodles And Notes