#13;యాపిల్ ఐఫోన్5 పానోరమా కెమెరా మోడ్ వంటి సరికొత్త ఫీచర్లను కలిగి స్మార్ట్ ఫోన్ కెమెరా వ్యవస్థను మరింత బలపేతం చేసింది. ఇటీవల విడుదలైన యాపిల్ కొత్త వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఐవోఎస్6, ఐఫోన్4ఎస్ కు సైతం పానోరమా కెమెరా మోడ్ ఫీచర్ ను చేరువ చేస్తోంది. పానోరమా కెమెరా మోడ్ 240 డిగ్రీల కోణంలో పూర్తి ఫోటోను చిత్రీకరించుకునేందుకు అనుమతిస్తుంది. #13;ఐవోఎస్6 ప్లాట్ ఫామ్ ను కలిగి ఉన్న యాపిల్ ఫోన్ నుంచి పానోరమా ఫోటోలను చిత్రీకరించటం ఏలా..? #13;ముందుగా కెమెరా అప్లికేషన్ ను మీ ఫోన్ లో ఇన్స్ స్టాల్ చేసుకోండి. ఇన్స్ స్టాలేషన్ ప్రక్రియ సక్రమంగా పూర్తి అయినట్లయితే అప్లికేషన్ లోకి ప్రవేశించండి. అప్లికేషన్ లోకి ప్రవేశించిన వెంటనే గ్రిడ్, హెచ్ డీఆర్ వంటి టాగిల్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. దిగువున పానోరమా బటన్ కనిపిస్తుంది. వాటిలో గ్రిడ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకుని పానోరమా బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఆన్ స్ర్కీన్ సూచనలతో కూడిన ఒక ట్యాబ్ స్ర్కీన్ ప్రత్యక్షమవుతుంది. #13; ఇప్పుడు స్ర్కీన్ క్రింది భాగంలో కనిపించే కెమెరా బటన్ ను ప్రెస్ చేసి ఉంచి కెమెరాను నిదానంగా ఇంకా ఒకే పరిధిలో 260 డిగ్రీల పాటు కదిలించండి. ఒక వేళ మీరు వేగంగా కదిలిస్తున్నట్లయితే అప్లికేషన్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ చర్య సక్రమంగా పూర్తి చేసినట్లయితే పానోరమా కెమెరా అప్లికేషన్ ఫోటోను పానోరమా మోడ్ లో విజయవంతగా చిత్రీకరిస్తుంది. చిత్రీకరించబడిన పానోరమా ఫోటో ఆటోమెటిక్ గా ఫోన్ లో సేవ్ కాబడుతుంది. #13; ఐవోఎస్6 ప్లాట్ ఫామ్ ను కలిగి ఉన్న యాపిల్ ఫోన్ నుంచి పానోరమా ఫోటోలను చిత్రీకరించటం ఏలా..? Wrong Panorama Photos Wrong Panorama Photos Wrong Panorama Photos Wrong Panorama Photos Wrong Panorama Photos Wrong Panorama Photos Wrong Panorama Photos Wrong Panorama Photos Wrong Panorama Photos