గూగుల్ పేలో ఫ్రాడ్‌ని తరిమికొట్టడం ఎలా ?


గూగుల్ పే వాడుతున్నారా? అయితే మీరు చాలా త జాగ్రత్తగా ఉండాలి. Good News అంటూ ఈ మధ్య మెసేజులు హల్ చల్ చేస్తున్నాయి. సైబర్ మోసగాళ్ల కొన్నిరోజుల నుంచి 'Google Pay వినియోగదారులకు శుభవార్త' అంటూ ఓ ఫేక్ న్యూస్ ని వైరల్ చేస్తున్నారు. ఆ మెసేజ్ కు మోసపోయి Links క్లిక్ చేసి చాలా మంది లక్షల్లో నష్టపోయారు. Scratch Cardను రూ.500 నుంచి రూ.5000 వరకూ గెలుచుకోవచ్చు' అని గూగుల్‌ పేకు Links ఫోన్‌కు మెసేజ్‌, వాట్సాప్‌ రూపంలో వస్తున్నాయి. ఇదెదో బంపర్ ఆఫర్ అంటూ ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్ ఖాళీ కావడం ఖాయమే సైబర్ అధికారులు అని హెచ్చరిస్తున్నారు. మరి దీన్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం.

స్టెప్ 1

ముందుగా మీ గూగుల్ పేని స్మార్ట్ ఫోన్ నుండి ఓపెన్ చేయండి

స్టెప్ 2

అక్కడ కనిపించే కాంటాక్ట్స్ దగ్గరకు వెళ్లండి. రిసీవ్ మని లేదా సెండ్ మనీ అనే ఆప్సన్ దగ్గర ఈ వివరాలు ఉంటాయి.

స్టెప్ 3

అక్కడ మీకు ఎవరైతే అనుమానాస్పదంగా కనిపిస్తారో వారిని వెంటనే బ్లాక్ చేయండి. బ్లాక్ చేయాలంటే మీ ఫోన్ కాంటాక్ట్ దగ్గర 3 డాట్లు కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేస్తే మీకు బ్లాక్ ఆప్సన్ కనిపిస్తుంది. వెంటనే బ్లాక్ చేయండి.

నగదు మీ బ్యాంక్‌ ఖాతాలో డిపాజిట్ చేయాలంటే మీ KYC వివరాలు అప్‌లోడ్‌ చేయండి అని ఈ మధ్య చాలామంది మెసేజులు పంపిస్తున్నారు. ఆశపడి మీ వివరాలు ఇచ్చారో అంతే సంగతులు మీ బ్యాంకు అకౌంట్ హ్యాకర్ల చేతుల్లోకి పోయినట్టే. సైబర్‌ నేరగాళ్లు క్రియేట్‌ చేసిన మోసపూరితమైన లింక్‌లని, వాటిని క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేస్తే బ్యాంక్‌ ఖాతాలోని సొమ్ము కాజేస్తారని పేర్కొన్నారు.

సైబరాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్‌కు అక్టోబర్‌ 21న ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం.. వెంటనే మీ కేవైసీ, ఖాతా వివరాలు అప్‌డేట్‌ చేయాలి.. లేకపోతే నిలిపివేస్తాం, డెబిట్‌ కార్డు పనిచేయదు అని దాని సారాంశం. ఆ మెసేజ్‌తోపాటు గూగుల్‌ లింక్‌ పంపారు. డాక్టర్‌ అనుమానించకుండా గూగుల్‌ లింక్‌ ఓపెన్‌ చేసి వివరాలు నింపారు. అవన్నీ సైబర్‌ నేరగాళ్లకు చేరాయి. నిమిషాల్లో డాక్టర్‌ ఖాతాలో ఉన్న రూ. 5.29 లక్షలు కాజేశారు.

Most Read Articles

Best Mobiles in India

Have a great day!
Read more...

English Summary

How to avoid fraud on Google Pay