Jio సెట్-టాప్ బాక్స్‌లో OTT యాప్ లను ఇన్‌స్టాల్ చేయడం ఎలా?


ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇప్పుడు ఇండియాలో కొన్ని ఉత్తమ ప్లాన్లను అందిస్తున్నది. డేటా మరియు వివిధ రకాల సర్వీసులను అందించే విషయానికి వస్తే రిలయన్స్ జియో కొన్ని ఉత్తమమైన సమర్పణలను అందిస్తున్నది. ఏదేమైనా రిలయన్స్ జియో కూడా ఇండియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను అందిస్తున్నది. ఈ జాబితాలో జియో సెట్-టాప్ బాక్స్ వంటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి.

Advertisement

రిలయన్స్ జియో యొక్క ఈ హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్ వినియోగదారులకు DTH మరియు OTT సేవలను ఒకే దాని మీద అందిస్తుంది. ఇతర ప్రసిద్ధ సెట్-టాప్ బాక్స్‌ల మాదిరిగానే ఈ సెట్-టాప్ బాక్స్ కూడా ఆండ్రాయిడ్ టీవీ ద్వారా ప్రారంభించబడుతుంది. రిలయన్స్ జియో సెట్-టాప్ బాక్స్ ఫ్రీ కాలింగ్, వీడియో కాలింగ్ వంటి మరిన్ని ఫీచర్లను కూడా అందిస్తుంది.

 

సరసమైన ధర వద్ద లాంగ్ టర్మ్ ప్లాన్‌లను అందిస్తున్న నెట్‌ఫ్లిక్స్

Advertisement

జియో యొక్క ఈ సెట్-టాప్ బాక్స్ ముందుగానే రిలయన్స్ జియో యాప్ లతో ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్‌ఫ్లిక్స్ వంటి కొన్ని ప్రసిద్ధ యాప్ లను సెట్-టాప్ బాక్స్‌లో చందాదారులు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. వాటిని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

తక్కువ ధర వద్ద ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అదనపు ప్రయోజనాలు

అవసరమైన యాప్ ల కోసం APK ని కనుగొనడం

ఈ పద్దతిలో మొదటి దశ మీ సెట్-టాప్ బాక్స్‌ను బూట్ చేయడం మరియు మెను యొక్క యాప్ లను ఓపెన్ చేయడం. ఇక్కడ మీరు జియో టీవీ+, జియోసినిమా, జియోసావన్ వంటి మరిన్ని యాప్ లను చూస్తారు. కానీ సెట్-టాప్ బాక్స్‌లో గల బ్రౌజర్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి. దీనిని ఓపెన్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన సంబంధిత అప్లికేషన్ యొక్క APK ఫైల్ కోసం సెర్చ్ చేయాలి.

 

 

నెట్‌ఫ్లిక్స్ కొన్ని స్మార్ట్ టీవీలలో పనిచేయదు.. ఇందులో మీ టీవీ కూడా ఉందేమో చూడండి??

జియో పేజెస్ లో యాప్ లను సెర్చ్ చేయడానికి మీరు రిమోట్‌లోని వాయిస్ సెర్చ్ బటన్‌ను నొక్కి సెర్చ్ కీవర్డ్‌ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు "అమెజాన్ ప్రైమ్ వీడియో" అని టైప్ చేస్తే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలిగే వెబ్‌సైట్ల జాబితా ఓపెన్ అవుతుంది. తరువాత ముందుకు వెళ్లి APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి.

 

 

ఇన్‌స్టాలింగ్ యాప్స్

APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసిన తరువాత సెట్-టాప్ బాక్స్ యొక్క సెట్టింగుల మెనుకు నావిగేట్ చేయాలి. ఇక్కడ మీరు బాక్స్‌లో ఇన్‌స్టాల్ చేసిన అన్ని యాప్ల జాబితాను కనుగొంటారు. జాబితా నుండి "యాప్ ఇన్‌స్టాలర్" అనే యాప్ ను ఓపెన్ చేయండి.

*** ఓపెన్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో APK ని ఎంచుకోండి.

*** ఎంచుకున్న తర్వాత ఇన్‌స్టాల్ బటన్ నొక్కండి.

*** దీని తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ మీ జియో సెట్-టాప్ బాక్స్‌లో ఇన్‌స్టాల్ చేయబడుతుంది.

*** ఇన్‌స్టాల్ చేసిన తరువాత మీరు లాగిన్ అవ్వవచ్చు మరియు మీరు చూడాలనుకుంటున్న షోలను చూడవచ్చు.

 

Best Mobiles in India

English Summary

How to Install Amazon Prime, Netflix Apps in Jio Set-Top Box