YouTube వీడియోలను రిపీట్ మోడ్(లూప్‌) లో ప్లే చేయడం ఎలా?


ప్రపంచం మొత్తం మీద యూట్యూబ్ కు ప్రత్యేక ఆదరణ ఉంది. ప్రజలు వారి యొక్క ఖాళీ సమయాలలో చేసే మొదటి పని యూట్యూబ్ ను ఓపెన్ చేసి అందులో వారికి నచ్చిన వీడియోలను చూడడం. సాధారణంగా ప్రజలు తమకు ఇష్టమైన పాటలను లేదా కామెడీ వీడియోలను పదే పదే చూడాలని అనుకుంటారు. కానీ యూట్యూబ్ వీడియోలను లూప్‌లో ప్లే చేయడానికి అనుమతించదు.

Advertisement

ప్రజలు తమకు ఇష్టమైన పాటలు లేదా సంగీతం, వాయిద్య పాట లేదా మరొక దానిని పదే పదే వినడానికి వినియోగదారులు ఎంచుకోవడానికి ఆన్లైన్ స్ట్రీమింగ్ మ్యూజిక్స్ యాప్ లు అనుమతిస్థాయి. ఇందులో గల ఒక సాంగ్ రిపీట్ మోడ్ లేదా మొత్తం ప్లేజాబితా రిపీట్ మోడ్ వంటివి ఎంచుకోవడం ద్వారా మీకు నచ్చిన పాటలను మళ్ళి వినవచ్చు. YouTube అప్రమేయంగా ఈ ఫీచర్ ను కలిగి లేదు. కానీ మీకు నచ్చిన వీడియోను లూప్‌లో ఉంచడం చాలా సులభం .

 

 

Xiaomi Mi 10: మొట్టమొదటి 108MP కెమెరా షియోమి ఫోన్ ఎలా ఉందొ చూడండి!!

Advertisement

బ్రౌజర్‌లోని యూట్యూబ్ వీడియోను లూప్‌లో ప్లే చేయడం కోసం కేవలం మూడు క్లిక్‌లు చేస్తే సరిపోతుంది. అయితే మొబైల్ యాప్ లో కొంచెం క్లిష్టంగా ఉంటుంది కానీ ఇది ఖచ్చితంగా సాధ్యమే. కాబట్టి కింద సూచించే దశల వారీ మార్గదర్శిని ఫాలో అవ్వడం ద్వారా యూట్యూబ్ వీడియోలను లూప్‌లో ప్లే చేయవచ్చు.

 

 

BSNL Prepaid Plans:ప్రైవేట్ టెల్కోలకు దీటుగా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

బ్రౌజర్‌లో యూట్యూబ్ వీడియోను లూప్‌లో ప్లే చేసే దశలు

*** ఏదైనా బ్రౌజర్‌లో యూట్యూబ్ వెబ్‌సైట్‌ను తెరిచి, మీరు లూప్‌లో చూడాలనుకుంటున్న వీడియోను ఎంచుకోండి


*** వీడియో ప్లే చేయడం ప్రారంభించిన తర్వాత వీడియో స్క్రీన్‌పై రైట్ బటన్ క్లిక్ చేసి 'లూప్' ఎంపికను ఎంచుకోండి

 

 

Realme C3 Sale ప్రారంభం... డిస్కౌంట్ ఆఫర్స్ అదుర్స్...

మొబైల్ యాప్ లో యూట్యూబ్ వీడియోను లూప్‌లో ప్లే చేసే దశలు

యూట్యూబ్ మొబైల్ యాప్ లో అటువంటి అంతర్నిర్మిత లూప్ ఫీచర్ ఏదీ లేదు. ఇక్కడ మేము సూచించే దశల ద్వారా వీడియోను లూప్‌లో ప్లే చేయవచ్చు.


*** మీ స్మార్ట్‌ఫోన్‌లో YouTube యాప్ ను ఓపెన్ చేసి అందులో మీరు లూప్‌లో ప్లే చేయదలిచిన వీడియోను ఎంచుకోండి.

*** ఇప్పుడు ప్లేబ్యాక్ స్క్రీన్ యొక్క కుడివైపున ఎగువ మూలలో గల '+' చిహ్నంపై నొక్కండి. అందులో కొత్త ప్లేజాబితా ఎంపికను ఎంచుకోండి.

*** ప్లేజాబితా యొక్క పేరును నమోదు చేసి ప్రైవసీ సెట్టింగ్‌ను సెట్ చేయడానికి 'Creat' చిహ్నాన్ని నొక్కండి.

*** దిగువన గల లైబ్రరీ చిహ్నంపై నొక్కి అందులో మీరు నమోదు చేసిన ప్లేజాబితాను ఎంచుకుని వీడియోను ప్లే చేయండి.

*** వీడియో ప్లే చేయడం ప్రారంభించిన తర్వాత క్రింది బాణంపై నొక్కండి మరియు రిపీట్ చిహ్నాన్ని ఎంచుకోండి.

 

Best Mobiles in India

English Summary

How to Play YouTube Videos on Loop: Steps Explained in Telugu