వాట్సాప్ అప్లికేషన్ పూర్తిగా యాడ్ ఫ్రీ. ఈ యాప్ లో ఏ విధమైన ప్రకటనలు మనుకు కనిపించవు. అందుకే ఈ యాప్ ను అభివృద్థి చేసిన డెవలపర్ తమను సపోర్ట్ చేసేందుకు ప్రతి ఒక్క వినియోగదారుడి నుంచి కొద్ది మొత్తంలో డబ్బును ఆశిస్తోంది. వాట్సాప్ అడిగిన కొత్త మొత్తాన్ని కూడా మీరు చెల్లించుకోలేని స్థితిలో ఉన్నట్లయితే పలు ట్రిక్స్ ను ఉపయోగించి వాట్సాప్ ట్రెయిల్ పిరియడ్ ను గడువు ఆఖరి తేదీ నుంచి సంవత్సరం పాటు పొడిగించుకోవచ్చు. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం... Read More : nbsp;గూగుల్ సీక్రెట్ కోడ్స్ ఇవే ముందుగా మీ డివైస్ లోని వాట్సాప్ అకౌంట్ ను ఓపెన్ చేయండి సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. అకౌంట్ విభాగంలోని Delete my account ఆప్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ కనిపించే ఫీల్డ్ లో మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి Delete my account పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వాట్సాప్ నుంచి పూర్తిగా తొలగించబడతారు. ఇప్పుడు కొత్త సమాచారంతో కొత్త వాట్సాప్ అకౌంట్ ను మీ డివైస్ లో ఓపెన్ చేసుకుని వాట్సాప్ ను ఉచితంగా ఆస్వాదించండి. ఇప్పుడు మీ కొత్త వాట్సాప్ అకౌంట్ ముగింపు తేదీని తెలుసుకునేందుకు అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Settings > Account > Payment infoలోకి వెళ్లండి. స్టెప్ 1: ముందుగా మీ డివైస్ లోని వాట్సాప్ అప్లికేషన్ ను అన్ ఇన్ స్టాల్ చేయండి. స్టెప్ 2: ఇప్పుడు మరోసారి వాట్సాప్ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకని ఇన్ స్టాల్ చేసుకోండి. స్టెప్ 3: కొత్త సమాచారంతో కూడిన కొత్త వాట్సాప్ అకౌంట్ ను డివైస్ లో ఓపెన్ చేసుకుని వాట్సాప్ ను ఉచితంగా ఆస్వాదించండి.