ఆపిల్ వాచ్‌లో డెలిట్ చేసిన యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయడం ఎలా?


ఆపిల్ వాచ్‌లో గల వాచ్‌ఓఎస్ 6 ఇప్పుడు అనేక కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. అందులో ఒకటి వాచ్‌లో ముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్ లను తొలగించడానికి మరియు మళ్ళి డౌన్‌లోడ్ చేయడానికి కూడా వినియోగదారులను అనుమతిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వినియోగదారులు ఆ యాప్‌ను ఉపయోగించకపోతే వారి ఆపిల్ వాచ్ నుండి ఫస్ట్-పార్టీ యాప్‌లను తొలగించవచ్చు.

Advertisement

అయితే మీరు ఏదైనా యాప్‌ను అనుకోకుండా తీసివేసినచో కొంతకాలం తర్వాత డెలిట్ చేసిన యాప్‌ను తిరిగి తీసుకురావాలనుకుంటే ఆపిల్ వాచ్‌లోని అంతర్నిర్మిత యాప్‌ స్టోర్ యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. కాబట్టి మీరు తొలగించిన యాప్‌లను మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలని చూస్తున్నట్లయితే ఆపిల్ వాచ్‌లో తొలగించిన యాప్‌లను తిరిగి ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా మొబైల్ చందాదారులకు బ్యాడ్ న్యూస్

Advertisement
గమనికలు

డౌన్‌లోడ్ చేయడానికి ముందుగా మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్ వాచ్‌ఓఎస్ 6 లేదా తరువాత తరంలో మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి మీ ఆపిల్ వాచ్ యొక్క వాచ్‌ఓఎస్ తాజా వెర్షన్‌తో రన్ అవుతోందని నిర్ధారించుకోండి. మరో ముఖ్యమైన విషయం ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా అవసరం. ఇది ఆపిల్ వాచ్ స్టోర్ నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి అవసరం.

 

 

షియోమి Mi రౌటర్ 4C రిలీజ్.... అధిక వేగం, గొప్ప ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫీచర్స్

ఆపిల్ వాచ్‌లో డెలిట్ చేసిన యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

ఇప్పుడు తొలగించిన యాప్ లను మళ్లీ డౌన్‌లోడ్ చేయడానికి క్రింది ఉన్న మూడు దశలను పాటించండి.

---- మొదట మీ ఆపిల్ వాచ్‌లో యాప్ స్టోర్ యాప్ ను ఓపెన్ చేసి అందులో "search" ఆప్షన్ మీద నొక్కండి. సెర్చ్ చేయడానికి మీరు వాయిస్ కమాండ్ ఇవ్వడం లేదా స్క్రైబుల్ ఇన్పుట్ పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు.

 

 

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్... ఫీచర్స్ ఇవే!!!

 

---- ఇప్పుడు మీరు డెలిట్ చేసిన యాప్ ను సెర్చ్ చేయడానికి వాయిస్ లేదా స్క్రైబుల్ ఇన్పుట్ పద్ధతిని ఉపయోగించండి.

---- డెలిట్ చేసిన యాప్ ను తిరిగి పొందడానికి "డౌన్‌లోడ్" క్లౌడ్ బటన్‌ను నొక్కండి.

Best Mobiles in India

English Summary

Learn How To Reinstall The Lost Apps On Apple Watch