ఈ 10 స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు కొనకండి, ఎందుకో తెలుసా ?


మీరు కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..అయితే మీరు ఈ మధ్య రిలీజయిన ఈ 10 స్మార్ట్ ఫోన్ల జోలికి వెళ్లకండి. ఎందుకంటే ఈ ఫోన్ల ధరలు త్వరలో తగ్గే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం వీటికి సక్సెస్ ర్ గా మార్కెట్లోకి మరికొన్ని ఫోన్లు రాబోతున్నాయి. అవి రానున్న నేపథ్యంలో ఈ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. మరి ఈ ఫోన్లు ఏంటి.. వీటికి విజయవంతంగా ఏ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఏ ఫోన్లు కొనుగోలు చేయకూడదు.. ఇలాంటి విషయాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

దేశీయ మార్కెట్‌లోకి ఒకేసారి 8 స్మార్ట్ టీవీలు, ధర రూ. 12,999 నుండి..

మోటో జీ6

మోటో జీ6 కొనుగోలు చేయాలనుకునే వారు మోటోజీ6 ప్లస్  సేల్ కి వెళ్లే దాకా ఆగితే బాగుంటుంది. అప్పుడు జీ6 ఫోన్ ధర తగ్గే అవకాశం ఉంది. 

iphone 8

ఆపిల్ నుంచి కొత్తగా 3 ఫోన్లు మార్కెట్ లోకి రాబోతున్న నేపధ్యంలో పాత ఐఫోన్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఫోన్లు లాంచ్ అయ్యేదాకా ఎదురుచూడటం మంచిది. 

ఐఫోన్ 8 ప్లస్

ఐఫోన్ 8 ప్లస్ ఫోన్ మరికొద్ది రోజుల్లో భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈ వారంలో ఆపిల్ నుంచి మార్కెట్లోకి మూడు ఫోన్లు రానున్నాయి. 

Iphone x

ఆపిల్ ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకున్నవారు ఈ నెల చివరి వరకు ఎదురుచూడాల్సిందే. ఆపిల్ కంపెనీ ఈ సంవత్సరంలో ఐఫోన్ ఎక్స్ ధరను భారీగా తగ్గించబోతుందనే రూమర్లు వస్తున్నాయి. కొత్త ఫోన్ మార్కెట్లోకి రాగానే పాత ఫోన్ ధరలను తగ్గించే ఆనవాయితీని కంపెనీ కొనసాగించే అవకాశం ఉంది. 

Google Pixel 2

Google Pixel 3 త్వరలో మార్కెట్లోకి రానున్న నేపధ్యంలో ఈ ఫోన్ ధర కూాడా భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Google Pixel 2 XL: Pixel 3 XL

Google Pixel 2 XL: Pixel 3 XL ఈ ఫోన్లు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. యూజర్లు వీటిని కొనాలనే ఆసక్తి ఉంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.

OnePlus 6

OnePlus 6t అక్టోబర్లో మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో OnePlus 6 ధర భారీగా తగ్గే అవకాశం ఉంది.

Nokia 8 Sirocco

Nokia 9 త్వరలో మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో Nokia 8 Sirocco ధరను కంపెనీ తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి అది లాంచ్ అయ్యేదాకా ఎదురుచూడాలల్సిందే.

LG V30 ThinQ

LG V40 ThinQ త్వరలో రానున్న నేపథ్యంలో ఈ ఫోన్ కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Huawei P20 Pro

Huawei P20 Pro కూడా తగ్గనుంది.దీనికి ప్రధాన కారణం హువాయి మేట్ 20 అక్టోబర్లో లాంచ్ కానుంది.


Have a great day!
Read more...

English Summary

10 smartphones you 'should not' ideally buy right now more news at Gizbot Telugu