రూ.14000 బడ్జెట్‌లో స్మార్టెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే!


సెల్ఫీ కెెమెరా ఫోన్‌లను అందించటంలో సంచలన బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒప్పో గతకొద్ది సంవత్సరాలుగా హై-క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తూ వస్తోంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా డిజైన్ కాబడుతోన్న ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లు సాఫ్ట్‌వేర్ ఇంకా హార్డ్‌వేర్ పరంగా పర్‌ఫెక్ట్ కాంభినేషన్‌ను కలిగి ఉంటున్నాయి.

Advertisement

రూ.15000 ధర సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ ఒప్పో రీసెంట్‌గా OPPO A83 పేరుతో సరికొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రూ.13,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోన్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకించి ఆఫ్‌లైన్ స్టోర్‌లలో మాత్రమే లభ్యమవుతోంది. సరికొత్త బెంచ్‌మార్క్స్‌తో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి 5 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలు..

ఒప్పో ఏ83 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన కెమెరాలతో ప్యాక్ అయి ఉంది. ఈ ఫోన్ ముందు, వెనుకా భాగాల్లో నిక్షిప్తం చేసిన కెమెరాలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సపోర్ట్‌తో అత్యుత్తమ అవుట్ పుట్‌ను ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన 13 మెగా పిక్సల్ సెన్సార్ F/2.2 అపెర్చుర్‌తో పాటు ఎల్ఈడి ఫ్లాష్ లైట్‌ను వినియోగించుకుంటుంది.

ముందు భాగంలో నిక్షిప్తం చేసిన 8 మెగా పిక్సల్ కెమెరా F/2.2 అపెర్చుర్‌తో పాటు 1/2.8 సెన్సార్‌ను యుటిలైజ్ చేసుకుంటుంది. మెచిన్ లెర్నింగ్ టెక్నాలజీ పై స్పందించగలిగే ఈ రెండు కెమెరాలు స్కిన్ టోన్స్, కలర్, ఏజ్, జెండర్ ఇంక సబ్జెక్ట్స్ మధ్య తేడాలను క్షుణ్నంగా పరిశీలించగలుగుతాయి.

ఈ కెమెరాలో పొందుపరించిన కాంప్లెక్స్ అల్గారిథమ్ ఫోటోను క్లిక్ చేస్తున్నది ఎవరో కూడా గుర్తించగలుగుతుంది. ఇదే సమయంలో ఈ కెమెరాలోని ఫెమినైన్ ఎన్‌హాన్స్‌మెంట్స్.. మేల్ సబ్జెట్స్ అలానే ఫిమేల్స్ సబ్జెక్ట్స్ మధ్య తేడాలను గుర్తించి వారి వయసును బట్టి ఎఫెక్ట్స్‌ను అద్దుతుంది.

ఏఐ బ్యూటీ టెక్నాలజీ ఫేస్ షేప్స్, స్టబ్బుల్, న్యాచురల్ స్కిన్ కలర్ వంటి ఫేషియల్ ఫీచర్ల పై ఎక్కువుగా శ్రద్ధ తీసుకుంటుంది. ఇక ఫ్రంట్ కెమెరాలోని పోర్ట్రెయిట్ మోడ్ ద్వారా చిత్రీకరించుకునే సెల్ఫీలకు బ్యాక్‌గ్రౌండ్‌లో Bokeh బోకెహ్ ఎఫెక్ట్స్‌ను అప్లై చేసుకునే వీలుంటుంది.

పెద్ద డిస్‌ప్లే, హైక్వాలిటీ మల్టీ మీడియా ఎక్స్‌పీరియన్స్

16:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లేలకు కాలం చెల్లుతోన్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు 18:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లేల పై దృష్టిసారిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒప్పో తన OPPO A83 డివైస్‌ను 18:9 యాస్పెక్ట్ రేషియో స్ర్కీన్‌తో ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 5.7 అంగుళాల డిస్‌ప్లే అత్యుత్తమ గేమ్ ప్లేతో పాటు ఎడ్జ్ టు ఎడ్జ్ వీడియో ప్లేబ్యాక్ ఇంకా హైక్వాలిటీ మల్టీటాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఎడ్జ్ టు ఎడ్జ్ స్ర్కీన్ ఈ డివైస్‌కు కంప్లీట్ బీజిల్-లెస్ లుక్‌ను తీసుకువచ్చింది.

ఫ్యూచరిస్టిక్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్

OPPO A83 స్మార్ట్‌ఫోన్‌కు ఫేషియల్ అన్‌లాక్ ఫీచర్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫోన్‌లో టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు బదులుగా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఒప్పో పొందుపరిచింది. ఈ సెక్యూరిటీ ఫీచర్‌తో యూజర్ తన ముఖాన్నే పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుని ఫోన్‌ను అన్‌లాక్ చేసే వీలుంటుంది. ఈ సూపర్ హై-స్పీడ్ టెక్నాలజీ కేవలం 0.4 సెకన్ల వ్యవధిలో ఫోన్‌ను అన్‌లాక్ చేయగలుగుతుంది.

ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైప్ చేయడం ఎలా ? ( సింపుల్ ట్రిక్స్ )

హార్డ్‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్ పెర్ఫామెన్స్

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఒప్పో ఏ83 స్మార్ట్‌ఫోన్‌ 2.5GHz మీడియాటెక్ 6763T ఆక్టా-కోర్ సీపీయూ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌కు జతచేసిన 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌ను ఆఫర్ చేయగలగుతుంది. ముఖ్యంగా గేమ్స్ ఆడతోన్న సమయంలో సీపీయూ పనితీరును మీకు అర్థమవుతుంది. ఇక స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ 32జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతోంది.

మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. స్ప్లిట్ స్ర్కీన్ మోడ్ ఫీచర్ ద్వారా వీడియోలు చూస్తూనే సోషల్ నెట్‌వర్కింగ్‌ను ఆస్వాదించే వీలుంటుంది. స్ర్కీన్‌షాట్ క్యాప్చుర్, స్ర్కీన్ కలర్ టోన్స్, ఒప్పో ఓ షేర్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్..

ఒప్పో ఏ83 స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన 3,180mAh బ్యాటరీతో వస్తోంది. సింగిల్ ఛార్జ్ పై రోజుంతా స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించుకునే వీలుంటుంది. పవర్ సేవింగ్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను మరింతగా ఆదా చేసుకోవచ్చు. చాంపేన్ గోల్డ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

Best Mobiles in India

English Summary

OPPO A83 is priced at Rs.13,999 and utilizes the power of Artificial Intelligence to enhance mobile user experience. The camera uses machine learning to deliver a reliable everyday performance to enhance your photography experience