రూ.9000 వరకు క్యాష్‌బ్యాక్‌తో లభిస్తోన్న 6 స్మార్ట్‌ఫోన్‌లు


ఈ పండుగల సీజన్‌లో భాగంగా కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా? అయితే, మీకిదే సరైన సమయం. సామ్‌సంగ్, యాపిల్, గూగుల్, షావోమి వంటి ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌ల పై 9000 రూపాయిల వరకు క్యాష్‌బ్యాక్‌ను పేటీఎమ్ మాల్ (Paytm Mall) ప్రొవైడ్ చేస్తోంది. ఈ లిమిటెడ్ పరియడ్ ఆఫర్ కొద్ది రోజుల మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

దోమల అంతు చూసేందుకు గూగుల్ కొత్త వ్యూహం

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 (Samsung Galaxy Note 9)

ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ.67,900గా ఉంది. తాజా ధర తగ్గింపులో భాగంగా పేటీఎమ్ మాల్ (Paytm Mall) ఈ ఫోన్ పై రూ.9,000 రూపాయిల క్యాష్‌బ్యాక్‌ను ప్రొవైడ్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్‌ పోనూ రూ.58,900కే ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది. నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వీలుంటుంది.

 

 

యాపిల్ ఐఫోన్ ఎక్స్ (Apple iphone x)

ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ.92,096గా ఉంది. తాజా ధర తగ్గింపులో భాగంగా పేటీఎమ్ మాల్ (Paytm Mall) ఈ ఫోన్ పై రూ.7,500 రూపాయిల క్యాష్‌బ్యాక్‌ను ప్రొవైడ్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్‌ పోనూ రూ.92,096కే ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది. నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వీలుంటుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్9+ (Samsung Galaxy s9+)

ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ70,000గా ఉంది. అయితే, ఈ ఫోన్ అనేక మార్లు ధర తగ్గింపును అందుకుంది. తాజా తగ్గింపులో భాగంగా పేటీఎమ్ మాల్ (Paytm Mall) ఈ ఫోన్ పై రూ.4,500 రూపాయిల క్యాష్‌బ్యాక్‌ను ప్రొవైడ్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్‌ పోనూ రూ.52,900కే ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది. నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వీలుంటుంది.

 

 

గూగుల్ పిక్సల్ 3 (Google Pixel 3)

ఆన్‌గోయింగ్ షాపింగ్ సేల్‌లో భాగంగా పేటీఎమ్ మాల్ (Paytm Mall) గూగుల్ పిక్సల్ 3 పై రూ.6,000 క్యాష్‌బ్యాక్‌ను ప్రొవైడ్ చేస్తోంది. అదనంగా రెండు శాతం డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్‌ అలానే డిస్కౌంట్ పోనూ రూ.63,799కే ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది. నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వీలుంటుంది.

 

 

యాపిల్ ఐఫోన్ 7 (Apple iphone 7)

ఆన్‌గోయింగ్ షాపింగ్ సేల్‌లో భాగంగా పేటీఎమ్ మాల్ (Paytm Mall), యాపిల్ ఐఫోన్ 7 పై రూ.3,000 క్యాష్‌బ్యాక్‌ను ప్రొవైడ్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్‌ పోనూ రూ.36,672కే ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది. నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వీలుంటుంది.

 

 

గూగుల్ పిక్సల్ 2 ఎక్స్ఎల్ (Google Pixel 2 XL)

ఆన్‌గోయింగ్ షాపింగ్ సేల్‌లో భాగంగా పేటీఎమ్ మాల్ (Paytm Mall), గూగుల్ పిక్సల్ 2 ఎక్స్ఎల్ పై రూ.6,500 క్యాష్ బ్యాక్‌ను ప్రొవైడ్ చేస్తోంది. అదనంగా 8 శాతం డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్ అలానే క్యాష్‌బ్యాక్‌ పోనూ రూ.37,499కే ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో గూగుల్ పిక్సల్ 2 ఎక్స్ఎల్ ఒరిజనల్ ధర రూ.45,499గా ఉంది.

 

 

 


Read More About: news smartphones offers paytm

Have a great day!
Read more...

English Summary

6 Smartphones available with up to maximum cashback of Rs 9,000 on Paytm Mall.To Know More About Visit telugu.gizbot.com