Asus కొత్త ఫోన్‌ల పై ఆఫర్లే ఆఫర్లు

తైవాన్ టెక్నాలజీ దిగ్గజం ఆసుస్ (Asus) రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.


తైవాన్ టెక్నాలజీ దిగ్గజం ఆసుస్ (Asus) రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. జెన్‌ఫోన్ మాక్స్ ఎమ్1 (ZB556KL) అలానే జెన్‌ఫోన్ లైట్ ఎల్1 (ZA551KL) మోడల్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిలో మాక్స్ ఎమ్1 మోడల్ ధర రూ.8,999గా ఉంది. లాంచ్ ఆఫర్ క్రింద ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7,499కే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

Advertisement

మరో 3 కొత్త ఫీచర్లను పరిచయం చేయబోతున్న వాట్సాప్

ఫ్లిప్‌కార్ట్ ధమాకా డేస్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకాలు..

ఇక రెండవ మోడల్ అయిన లైట్ ఎల్1 ధర రూ.6,999గా ఉంది. లాంచ్ ఆఫర్ క్రింద ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5999కే ఫ్లిప్‌కార్ట్‌ అందించబోతోంది. త్వరలో ప్రారంభం కాబోతోన్న ఫ్లిప్‌కార్ట్ ధమాకా డేస్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటాయి.

Advertisement
రూ.2,200 క్యాష్‌బ్యాక్‌తో 50జీబి జియో డేటా ఉచితం..

లాంచ్ ఆఫర్స్ క్రింద ఈ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై రూ.2,200 క్యాష్‌బ్యాక్‌తో పాటు 50జీబి అదనపు జియో డేటా యూజర్లకు అందుబాటులో ఉంటుంది. అదనంగా రూ.99 చెల్లించినట్లయితే ఏడాది పాటు కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ వారికి అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో నో కాస్ల్ ఈఎమ్ఐ సదుపాయం కూడా ఈ ఫోన్‌ల పై వర్తిస్తుంది.

జెన్‌ఫోన్ మాక్స్ ఎమ్1 స్పెసిఫికేషన్స్..

5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే (720x1440 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ జెన్‌ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 5.0, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీ, వై-ఫై, బ్లుటూత్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి. ఫోన్ చుట్టుకొలత 147.3x70.9x8.7 మిల్లీ మీటర్లు, బరువు 150 గ్రాములు.

జెన్‌ఫోన్ లైట్ ఎల్1 స్పెసిఫికేషన్స్..

5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే (720x1440 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ జెన్‌ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 5.0, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి. ఫోన్ చుట్టుకొలత 147.26x71.77.8.15 మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

Best Mobiles in India

English Summary

Asus ZenFone Max M1 (ZB556KL), ZenFone Lite L1 (ZA551KL) Launched in India: Price, Specifications.To Know More About Visit telugu.gizbot.com