రూ.15,000ధరలో లభించే బెస్ట్ 6జీబీ ర్యామ్ ఫోన్స్ ఇవే

టెక్నాలజీ అమితవేంగతో పుంజుకుపోతోంది. మార్కెట్లోకి దిగ్గజ కంపెనీలు రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో ఫోన్లను తీసుకువస్తున్నాయి.


టెక్నాలజీ అమితవేంగతో పుంజుకుపోతోంది. మార్కెట్లోకి దిగ్గజ కంపెనీలు రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో ఫోన్లను తీసుకువస్తున్నాయి. అత్యంత తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లను తీసుకువస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ర్యామ్, కెమెరాల వైపు అందరి చూపు నిలుస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో 6జిబి ర్యామ్ ఫోన్లు ఇప్పుడు యూజర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

Advertisement

ముఖ్యంగా గేమింగ్ ప్రియులకు ఈ ర్యామ్ ఫోన్లు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయనే చెప్పవచ్చు. గేమ్ ఎంతసేపు ఆడినా ర్యామ్ నుంచి వారికి ఎటువంటి సమస్య రాకుండా ఉండాలంటే వీలైనంత ఎక్కువ స్థాయిలో ర్యామ్ ఉండాలన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే యాప్స్ రన్ కావాలన్నా కూడా ర్యామ్ సపోర్ట్ చాలా అవసరం. ఫోన్ స్మూత్ గా రన్ కావాలంటే ర్యామ్ ఎక్కువగా ఉంటేనే రన్ అవుతుంది. అందుకే వినియోగదారులంతా రూ.15 వేల బడ్జెట్లో ఎక్కువ ర్యామ్ ఉండే ఫోన్లకోసం చూస్తున్నారు. ఈ శీర్షికలో భాగంగా రూ.15,000ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ల లిస్టును ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Advertisement

మార్చ్ 25న జరిగే స్పెషల్ ఈవెంట్ ఆపిల్ ఏం లాంచ్ చేయబోతుందో తెలుసా..?

Motorola Moto G6 Plus

ధర రూ.14,987

ఫీచర్లు

5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, పీ2ఐ వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, డాల్బీ ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

 

 

Asus Zenfone Max Pro M1

ధర రూ.14,987

ఫీచర్లు

5.99 ఇంచ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 16 డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 5.0, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi Note 5 Pro

ధర రూ.13,999

ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Motorola Moto X4

ధర రూ.13,999

ఫీచర్లు

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

 

Best Mobiles in India

English Summary

Best budget smartphones with 6GB RAM under Rs. 15,000.To Know More About Visit telugu.gizbot.com