ఈ ఫోల్డబుల్ మొబైల్ ఫోన్లను చూస్తే మతిపోవాల్సిందే

స్మార్ట్‌ఫోన్ లో రోజుకో సరికొత్త టెక్నాలజీ వస్తూ, మొబైల్ యూజర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి కంపెనీలు.


స్మార్ట్‌ఫోన్ లో రోజుకో సరికొత్త టెక్నాలజీ వస్తూ, మొబైల్ యూజర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి కంపెనీలు. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిదారులైన శామ్‌సంగ్,హువాయ్ ,రాయొలే వంటి కంపెనీలు మార్కెట్లోకి తమ ఫోల్డబుల్ మొబైల్ ఫోన్లను లాంచ్ చేసాయి.మరికొద్ది రోజుల్లో షియోమి,ఒప్పో,మోటోరోలా, మరియు యాపిల్ కూడా తమ ఫోల్డబుల్ మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా మార్కెట్లో విడుదలైన అలాగే విడుదల కాబోతున్న ఫోల్డబుల్ మొబైల్ ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

Advertisement

వాట్సప్ వాడేవారికి హెచ్చరికలు జారీ చేసిన SBI

Samsung Galaxy Fold

Samsung Galaxy Fold ఫోన్‌లో రెండు స్క్రీన్స్ ఉంటాయి. ఒక డిస్‌ప్లే 7.3 ఇంచ్ సైజ్ కాగా, మ‌రో డిస్‌ప్లే సైజ్ 4.6 ఇంచులుగా ఉంది. కాగా 7.3 ఇంచుల డిస్‌ప్లేను మ‌డ‌త‌బెట్టే విధంగా రూపొందించారు. ఒకేసారి మూడు యాప్ ల‌ను ఈ ఫోన్ డిస్‌ప్లేల‌పై ర‌న్ చేసుకోవ‌చ్చు. అలాగే వాట్సాప్‌, యూట్యూబ్ తదిత‌ర సోష‌ల్ యాప్స్‌ను ఇందులో ప్ర‌త్యేకంగా అందిస్తున్నారు. ఫోన్ కోస‌మే ప్ర‌త్యేకంగా ఈ యాప్‌ల‌ను భిన్న ర‌కాల్లో డిజైన్ చేశారు.ఇక ఈ ఫోన్ ఏప్రిల్‌లో వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. కాగా ఈ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ధ‌రను శాంసంగ్ వెల్ల‌డించ‌లేదు. కానీ దీని ధ‌ర‌ రూ.1,41,300 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చ‌ని తెలిసింది.4జీతోపాటు 5జీ వేరియెంట్‌లోనూ ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు

Advertisement
Huawei Mate X

ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ 2019 ప్ర‌దర్శ‌న‌లో హువాయి కంపెనీ ఈ Huawei Mate X ను లాంచ్ చేసింది. ఇందులో 6.6 ఇంచుల డిస్‌ప్లేను ముందు భాగంలో, 6.38 ఇంచుల డిస్ ప్లేను వెనుక భాగంలో అమ‌ర్చారు. ఈ రెండింటినీ మ‌డ‌త తీసిన‌ప్పుడు డిస్ ప్లే ఒకటే అవుతుంది. అప్పుడు ఆ డిస్‌ప్లే సైజ్ 8 ఇంచుల వ‌ర‌కు వ‌స్తుంది. ఇలా ఈ ఫోన్ ను మ‌డ‌త‌బెట్టుకోవ‌చ్చు. ఇక ఈ ఫోన్‌లో 5జీ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అలాగే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ను సైడ్‌కు అమ‌ర్చారు. వెనుక భాగంలో 40, 16, 8 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉన్నాయి. ఈ ఫోన్‌లో మైక్రో ఎస్డీ కార్డుకు బ‌దులుగా ఎన్ఎం కార్డు స్లాట్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఆ స్లాట్‌లో ఎన్ఎం కార్డును వేసుకుని స్టోరేజీని పెంచుకోవ‌చ్చు. అలాగే ఈ ఫోన్‌కు 55 వాట్ల సూపర్ చార్జ్ ఫీచ‌ర్‌ను కూడా అందిస్తున్నారు. ప్ర‌పంచంలో ఈ ఫీచ‌ర్ తో వ‌చ్చిన ఫోన్ ఇదే కావ‌డం విశేషం. కాగా ఈ ఫోన్ లో ఉన్న 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ చార్జ్ 0 నుంచి 85 శాతం చార్జింగ్ అయ్యేందుకు కేవ‌లం 30 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ప‌డుతుంది.

ప్రత్యర్థులకు దీటుగా కొత్త ప్లాన్ ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

Royole FlexPai

దిగ్గజ కంపెనీలకు షాక్ ఇస్తూ చైనా మొబైల్ కంపెనీ ‘రాయొలే' ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది . రాయొలే విడుదల చేసిన ‘ఫ్లెక్స్‌పై' ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు క్రియేట్ చేసింది.ఈ ఫోన్ ను సగానికి మడత పెట్టి జేబులో పెట్టుకోవచ్చు . మడిచిన తర్వాత కూడా ఇది డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో రెండు కెమెరాలు ఉన్నాయి. టెలిఫోటో లెన్స్‌తో 20 మెగా ఫిక్సెల్ కెమెరా ఒకటి, వైడ్ యాంగిల్ లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ మరో కెమెరాను అమర్చింది రాయొలే కంపెనీ. రెండు కెమెరాలు వెనకే ఉన్నా, మొబైల్ మడతబెట్టినప్పుడు 20 మెగాపిక్సెల్ కెమెరాను సెల్ఫీ కెమెరాగా ఉపయోగించుకోవచ్చు.

Oppo Foldable Phone

ఒప్పో త్వరలో ఫోల్డబుల్ ఫోన్ ను లాంచ్ చేస్తునట్టు గతంలోనే .అయితే ఇప్పటివరకైతే ఒప్పో కంపెనీ దీని ఫీచర్ల పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.అయితే ఈ ఒప్పో ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు మాత్రం మాత్రం Huawei Mate X లాగే ఉండవచ్చు అని పుకార్లు వినిపిస్తున్నాయి.

Motorola Foldable Phone

త్వరలో మోటోరోలా కూడా ఫోల్డబుల్ ఫోన్ ను లాంచ్ చేయబోతుంది.ఆ ఫోన్ కి సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.

Best Mobiles in India

English Summary

Foldable Mobile Phones: Samsung, Huawei, Motorola and other brands to look out for.To Know More About Visit telugu.gizbot.com