జియోఫోన్‌కి పోటీగా గూగుల్ ఫోన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ?

సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకుపోతున్న టెలికాం దిగ్గజం గూగుల్ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతోంది.


సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకుపోతున్న టెలికాం దిగ్గజం గూగుల్ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతోంది. రిలయన్స్ నుంచి ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి ఊహించని సంచంలనంతో దూసుకొచ్చిన జియో ఫోన్ కి పోటీగా గూగుల్ సరికొత్త ఫోన్ ని ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కంపెనీ కొత్తగా లాంచ్ చేయనున్న ఫోన్ కూడా ఇదేనని తెలుస్తోంది. కాగా కంపెనీ దీని పేరును WizPhone WP006గా నిర్ణయించింది. ఈ గూగుల్ ఫోన్ అచ్చం ఫీచర్ ఫోన్ ని పోలి ఉంది. జియో ఫోన్ ఎలా పనిచేస్తుందో అచ్చం అలానే ఈ ఫోన్ కూడా పనిచేయనున్నట్లు స్మార్ట్ ఫీచర్లు అదనంగా యాడ్ చేసింది. ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

Advertisement

మెసెంజర్ లైట్ యాప్ లో కొత్త ఫీచర్ ను యాడ్ చేసిన ఫేస్‌బుక్

గూగుల్ అసిస్టెంట్

గూగుల్ నుంచి రానున్న ఫోన్లో ప్రధానంగా గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ఉండనుంది. జియో ఫోన్ లో ఉండే KaiOS అలాగే వాయిస్ కమాండ్ ఇచ్చేందుకు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

Advertisement
వాట్సప్ సపోర్ట్

జియోఫోన్ , జియోఫోన్ 2లో ఉండే అన్ని రకాల ఫీచర్లు గూగుల్ నుంచి రానున్న ఫోన్లో ఉండనున్నాయి.ముఖ్యంగా ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ కూడా ఈ ఫోన్లో ఉండనుంది. కియోస్ ద్వారానే ఈ యాప్ రన్ కానున్నట్లు తెలుస్తోంది.

 

 

లాంచ్ ఎక్కడ

గూగుల్ నుంచి రానున్న WizPhone WP006 ఫీచర్ ఫోన్ మొదలగా ఇండోనేషియా మార్కెట్లో లాంచ్ అయింది. ఇండోనేషియాలో జరిగిన GoogleForIndonesia eventలో గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ Scott Huffman ఈ ఫోన్ ని లాంచ్ చేశారు.

ధర

కాగా ఈ ఫోన్ ధర అక్కడ IDR 99,000గా ఉంది. దీన్ని మన ఇండియన్ కరెన్సీలోకి తీసుకుంటే కేవలం రూ.499 మాత్రమే. డాలర్లలో చెప్పాలంటే WizPhone WP006 ధర 7 డాలర్లుగా ఉంది. అయితే ఇండియాలో దీని ధర ఎంతనేది ఇంకా క్లారిటీ లేదు.

 

 

ఇండియాకి ఎప్పుడు

అయితే ఈ ఫోన్ ఇండియాకి ఎప్పుడు వస్తుందనేదానిపై కంపెనీ ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. WizPhone WP006 4జీ కనెక్టివిటీతో పాటు గూగుల్ కి సంబంధించిన అన్ని రకాల ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. మరి ఇండియాకి కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మొత్తం ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే

ఈ ఫోన్ ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..ఇందులో 512ఎంబిబి ర్యామ్, 4జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 2.4 ఇంచ్ స్క్రీన్, 2 ఎంపి రేర్ కెమెరా, విజిఎ ఫ్రంట్ కెమెరా, 1800mAh బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ MSM8905 chipset, KaiStore ఆపరేటింగ్ సిస్టం, గూగుల్ యాప్స్, వాట్సప్ సపోర్ట్, Google Assistant, Google Maps,Google Search వంటి ఫీచర్లు ఉన్నాయి.

Best Mobiles in India

English Summary

Google launches a Rs 500 JioPhone competitor called WizPhone WP006, not available in India yet more News at Gizbot telugu