Honor 6X ధర రూ.2,000 తగ్గింది
హానర్ 6ఎక్స్ ఫోన్‌లను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.
హువావే హానర్ బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Honor 6X ఫోన్ రూ.2,000 వరకు ధర తగ్గింపును అందుకుంది. జనవరి, 2017లో లాంచ్ అయిన హానర్ 6ఎక్స్ ఫోన్ రెండు వేరియంట్‌లలో లభ్యమవుతోంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి (3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్), రెండ వేరియంట్ వచ్చే సరికి (4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్). లాంచ్ సమయంలో ఈ రెండు వేరయంట్‌ల ధరలు రూ.12,999, రూ.15,999గా ఉన్నాయి.

తాజా ధర తగ్గింపు నేపధ్యంలో 32జీబి వేరియంట్ ధర రూ.1000 తగ్గి రూ.11,999 దగ్గర ఫిక్స్ అయ్యింది. 64జీబి వేరియంట్ ధర రూ.2,000 తగ్గి రూ.13,999 దగ్గర ఫిక్స్ అయ్యింది. హానర్ 6ఎక్స్ ఫోన్‌లను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

హానర్ 6ఎక్స్ స్పెసిఫికేషన్స్.. 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1,080 x 1,920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ విత్ EMUI 5.0, హువావే ఆక్టా కోర్ కైరిన్ 655 సాక్, మాలీ టీ830-ఎంపీ2 జీపీయూ, ర్యామ్
వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 12 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కేమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కేమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3,340mAh బ్యాటరీ.


Click it and Unblock the Notifications