బడ్జెట్ లెవల్లో బెస్ట్ పనితీరును కనబరుస్తున్న Honor 8c స్మార్ట్ ఫోన్


భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్. గతకొద్ది సంవత్సరాలుగా మారుతూ వస్తోన్న ట్రెండ్‌లను మనం అంచనా వేసినట్లయితే స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి దూసుకొచ్చిన హానర్ హై-ఎండ్ ఫోన్‌లతో పోటీగా మిడ్-రేంజ్ ఫోన్‌లను అందిస్తున్నాయి. తాజాగా ఈ బ్రాండ్ హానర్ 8సి ను మార్కెట్లో లాంచ్ చేసింది.

ధర

ఈ హానర్ 8సి 4జిబి+32జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999 ఉండగా 64జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999గా ఉంది.ఈ ఫోన్ అరోరా బ్లూ మరియు మేజిక్ నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క సేల్స్ డిసెంబర్ 10నుంచి అమెజాన్ మరియు హానర్ స్టోర్ లో ప్రారంభం కానుంది.

బడ్జెట్ ధరలో ప్రీమియం డిజైన్ 

హానర్ 7సి సక్సెసర్ వెర్షన్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టిన హానర్ 8సి మిడ్-రేంజ్ మార్కెట్‌కు కొత్త కళను తీసుకువచ్చింది. ఈ ఫోన్‌లో ఎక్విప్ చేసిన 6.26 అంగుళాల బారీ స్క్రీన్, స్లిమ్ బీజిల్స్ అలానే చిన్న నాట్చ్‌ ఆధునిక డిజైనింగ్‌కు అద్దం పడుతోంది. హానర్ 8సి లో ఎక్విప్ చేసిన భారీ స్క్రీన్ ఫుల్ హెచ్‌డి ప్లస్ (1520 x 720) రిసల్యూషన్ ను ఆఫర్ చేస్తుంది.

డ్యూయల్-లెన్స్ AI కెమెరాలు

క్వాలిటీ విషయానికి వచ్చేసరికి హానర్ 8సి మొదటి లుక్‌లోనే ప్రీమియమ్ ఫీల్‌ను కలిగిస్తుంది. డివైస్ వెనుక భాగాన్ని పరిశీలించినట్లయితే 13 మెగా పిక్సల్ + 2మెగా పిక్సల్ కాంభినేషన్‌తో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ మనకు కనిపిస్తుంది. ఈ సెటప్ పక్కనే ఎల్ఈడి ఫ్లాష్ మనకు కనిపిస్తుంది. ఈ కెమెరా హై-ఎండ్ ఫోన్‌లకు పోటీగా హైక్వాలిటీ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

Qualcomm Snapdragon 632 CPU తో వచ్చిన మొదటి ఫోన్

ఇక హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి హానర్ 8సి Qualcomm Snapdragon 632 CPU ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఒక చిప్లో మిడ్ -రేంజ్ 64-బిట్ ARM LTE వ్యవస్థ క్రోయో 250 కలయికను కలిగి ఉంది, అధిక ప్రాసెసింగ్ కోర్స్ మరియు అడ్రినో 506 GPU ప్రాసెసింగ్ మరియు గ్రాఫికల్ సంబంధిత టాస్కులకు పనిచేస్తుంది. మీరు మీ స్మార్ట్ ఫోన్లో గేమింగ్ ఇష్టపడుతున్నట్లయితే, మీరు కేవలం హానర్ 8C గేమింగ్ సూట్ను ఎంతగానో ఇష్టపడతారు. ఇది నిరంతరాయ గేమింగ్ అనుభవాన్ని అందించడానికి డివైజ్ యొక్క సాఫ్ట్ వేర్ కోడ్ చేయబడింది. మీరు గేమింగ్ ప్రారంభించినప్పుడు నోటిఫికేషన్లు ఏమీ రానివ్వకుండా ఆపడానికి గేమింగ్ సూట్ ప్రత్యేక 'Do Not Disturb' మోడ్ లో మారుతుంది.

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే ఈ డివైస్‌లో 4జీబి ర్యామ్‌తో పాటు 32,64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 8.1 ఓరియో పై ఫోన్ రన్ అవుతుంది.

బిగ్ బ్యాటరీ,డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్

హానర్ 8సి లో లోడ్ చేసిన 4000mAh బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్‌ను ప్రొవైడ్ చేయగలుగుతుంది.అదే విధంగా ఎడమ చేతి వైపు భాగంలో ఏర్పాటు చేసిన ట్రిపుల్ కార్డ్ ట్రేలో రెండు నానో-సైజిడ్ (nano-sized) సిమ్ కార్డులతో పాటు మైక్రోఎస్డీ కార్డును ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకోవచ్చు. ఫోన్ కుడి చేతి వైపు వాల్యుమ్ అలానే పవర్ లాక్ బటన్లు అమర్చి ఉంటాయి. వీటిని ఈజీగా రీచ్ అవ్వొచ్చు.


Have a great day!
Read more...

English Summary

Honor 8C: Flagship level performance at budget price-point.To Know More About Visit telugu.gizbot.com