అదిరిపోయే ఫీచర్లతో ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన Honor 8X

హువాయి సబ్సిడరీ బ్రాండ్ హానర్, Honor 8X పేరుతో మరో శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి ఈ రోజు లాంచ్ చేసింది.


హువాయి సబ్సిడరీ బ్రాండ్ హానర్, Honor 8X పేరుతో మరో శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి ఈ రోజు లాంచ్ చేసింది. ఈ మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌ను కొద్ది గంటల క్రితమే ఇండియా మార్కెట్లో లాంచ్ అయింది . Honor 7Xకు అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసారు. బ్లూ, బ్లాక్ కలర్ వేరియెంట్లలో అందుబాటులో ఉండే ఈ Honor 8X అక్టోబర్ 24న సేల్ కి రానుంది.

Advertisement

Honor 8X ధర ఇంకా అందుబాటు..

మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరజ్ కెపాసిటీతో లభ్యమవుతోంది. ఈ ఫోన్ విలువ సుమారు రూ. 14,999గా ఉంది. రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరజ్ కెపాసిటీతో లభ్యమవుతోంది. ఈ ఫోన్ విలువ సుమారు రూ. 16,999గా ఉంది.
మూడవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతోంది.ఈ ఫోన్ విలువ సుమారు రూ. 18,999గా ఉంది.

Advertisement
Honor 8X స్పెసిఫికేషన్స్..

6.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (1080x2340 పిక్సల్స్) టీఎఫ్టీ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, హైసిలికాన్ కైరిన్ 710ఎఫ్ సాక్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 20 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా యూనిట్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Honor 7Xకు అప్‌డేటెడ్ వెర్షన్..

ఇండియన్ మార్కెట్లో హానర్ 7ఎక్స్‌ డివైస్ గొప్ప విజయాన్ని అందుకున్న నేపథ్యంలో దానికి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా హానర్ 8ఎక్స్‌ డివైస్‌ను హువాయి రంగంలోకి దింపబోతోంది. మార్కెట్లో హానర్ 7ఎక్స్ డివైస్ రెండు వేరియంట్‌లలో లభ్యమవుతోంది. 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్. ఈ ఫోన్ లను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది

Honor 7X స్పెసిఫికేషన్స్…

మెటల్ యునిబాడీ, 5.93 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (2160 x 1080 పిక్సల్స్) డిస్‌ప్లే విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ హువావే ఎమోషన్ 5.1 యూజర్ ఇంటర్‌ఫేస్, హువావే హైసిలికాన్ కైరిన్ 659 2.5గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ విత్ మాలీ టీ830-ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3340 ఎమ్ఏహెచ్ నాన్ - రిమూవబుల్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై (802.11 బీ/జీ/ఎన్), బ్లుటూత్ 4.1, జీపీఎస్, ఫోన్ చుట్టుకొలత 156.5 x 75.3 x 7.6 మిల్లీ మీటర్లు, బరువు 165 గ్రాములు.

Best Mobiles in India

English Summary

Honor 8X launched in India with dual AI cameras; price starts Rs. 14,999.To Know More About Visit telugu.gizbot.com