స్మార్ట్‌ఫోన్ ఆర్టిపీషియల్ వల్ల ఈ ప్రమాదాలు వస్తున్నాయట


స్మార్ట్‌ఫోన్స్ వల్ల మానవులు అనేక ప్రమాదాల భారీన పడుతున్నారని సర్వేలు తెలుపతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కన్నొ సమస్యలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. స్మార్ట్‌ఫోన్స్ వాడకం వల్ల నిద్రలేమితో పాటు అనేక రకాల సమస్యలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని సైంటిస్టులు కనుగొన్నారు. స్మార్ట్‌ఫోన్స్ వాడకం వల్ల migraines, insomnia, jet lag and circadian rhythm disorders వంటి వాటి భారీన పడుతున్నారని వారు వెల్లడిస్తున్నారు. యుఎస్ లోని Salk Institute వారు ఈ విషయంపై ప్రయోగాలు చేయగా ఈ విషయాలు తెలిసాయి.

కలవరపెడుతున్న 5జీ, అది వస్తే చావు తప్పదా ?

ఆర్టిఫీషియల్ లైట్ ఎఫెక్ట్

స్మార్ట్‌ఫోన్స్ లోని ఆర్టిఫీషియల్ లైట్ ద్వారా మనిషి విపరీతమైన ఒత్తిడికి గురి అవుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. రాత్రులు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటి ఉదయం లేచిన తరువాత అదే ధ్యాసలో ఉంటున్నారని దీని వల్ల అనేక రకాలైన సమస్యలు తలెత్తుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు.

 

 

అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు

ఈ కారణం చేత migraines, insomnia, jet lag and circadian rhythm disorders లాంటి సమస్యలు వస్తున్నాయని దీనికి కొత్త ట్రీట్ మెంట్ అవసరమవుతుందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.

రెటినాకు దెబ్బ

కంటిలో ఉంటే అత్యంత సున్నితమైన పొరలు ఈ లైట్ దెబ్బకు పాడవుతున్నాయని, దీని వల్ల కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది ఫిక్సల్, డిజిటల్ కెమెరా కన్నా చాలా ఘోరంగా ఉందని లైటు పపర విపరీతంగా ఉంటుంది అని వారు తెలిపారు.

 

 

వెలుతురు మరీ ఎక్కువైతే

కంటిలో ముందు భాగంలో కనిపించే కార్నియా ద్వారా కాంతి లోపలికి ప్రసారం అవుతుంది. ఐరిస్ ఈ కాంతి ఎంత మేరకు అవసరమో ఆ మేరకే కనుపాప తెరచుకునేలా నియంత్రిస్తుంది. కనుపాప వెనుక లెన్స్ ఉంటాయి. ఇది తనకు చేరిన చిత్రాలను ఎలక్ట్రానిక్ సంకేతాల రూపంలో రెటీనాకు పంపిస్తుంది. ఈ సంకేతాలు రెటీనా నుంచి ఆప్టిక్ నెర్వ్ ద్వారా మెదడుకు వెళతాయి. దాంతో మన కళ్ల ముందు ఏముందీ మెదడుకు తెలిసిపోతుంది. అయితే ఈ వెలుతురు మరీ ఎక్కువైతే చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వినియోగం తగ్గించడం..

సాధ్యమైనంత వరకు వినియోగం తగ్గించడం. కాల్స్, మెస్సేజ్ లు, అత్యవసర మెయిల్స్ వీటికోసమే వాడుకోవడం. వినోద కార్యక్రమాలకు ఫోన్ కు బదులు టీవీ, ఇతరత్రా సాధనాలను ఎంచుకోవడం ద్వారా ఈ రకమైన సమస్యలను నివారించుకోవచ్చని చెబుతున్నారు.

వెన్నెముక డిస్క్ లపై భారం

యవతీ, యువకుల్లోనూ స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల వెన్ను సంబంధిత సమస్యలు గత కొన్ని సంవత్సరాల్లో బాగా పెరిగిపోయాయని బ్రిటిష్ చిరో ప్రాక్టిక్ అసోసియేషన్ చెబుతోంది. 2015 గణాంకాల ప్రకారం 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 45 శాతం మంది నడుం నొప్పి సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. వెన్నెముక డిస్క్ లపై భారం మోపడమే దీనికి కారణం.

 

 

నరాలు దెబ్బతినిపోవడం, మైగ్రేయిన్

స్మార్ట్ ఫోన్ వినియోగంతో ఒసిప్టల్ న్యూరాల్జియా అనే నరాల సంబంధిత సమస్య వస్తోంది. వెన్నుపూస పైభాగం నుంచి వెళ్లే నరాలు ఒత్తిడికి గురై వాచిపోవడం ఈ స్థితిలో జరుగుతుంది. దీంతో తలనొప్పి లేదా తీవ్రమైన తలనొప్పికి కారణమయ్యే మైగ్రేయిన్ ఎదురవుతుంది. ఇది వస్తే మాత్రం నయం కాదు. నొప్పిని అదుపు చేసేందుకు మందులు వాడుకోవడం, విశ్రాంతి తీసుకోవడమే. యోగా చేయడం, స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేయడం ద్వారా రిలీఫ్ ఉంటుంది.


Have a great day!
Read more...

English Summary

Not able to sleep properly? Here's why your smartphone is to blame more News at Gizbot Telugu