ట్రిపుల్ కెమెరాలతో మార్కెట్లోకి లాంచ్ అయిన Huawei P Smart+(2019)

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువాయి మొబైల్ మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త కొత్త ఫోన్లతో మార్కెట్లోకి దూసుకొస్తోంది.


చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువాయి మొబైల్ మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త కొత్త ఫోన్లతో మార్కెట్లోకి దూసుకొస్తోంది. ఇందులో భాగంగా తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన Huawei P Smart+ (2019) ను చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో వచ్చిన Huawei P Smart(2019)కు సక్సెసర్ గా ఈ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది . . అయితే ఇండియా మార్కెట్లోకి ఈ ఫోన్ ఎప్పుడు రాబోతుందో అన్న దాని పై కంపెనీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.మరి ఫీచర్లు, ధర లాంటి వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Advertisement

దీపావళికి బంపర్ డీల్స్, ముఖేష్ అంబానీ నయా ఎంట్రీ

ఫీచ‌ర్లు...

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 24, 2, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Advertisement
ధర :

ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు రూ.21,330 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది.

డిస్‌ప్లే :

6.21 ఇంచ్ డిస్‌ప్లేతో పాటు 1080p screen ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. 2340x1,080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ :

అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన octa-core processorతో పాటు Kirin 710తో ఈఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 3జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ లలో లభ్యమవుతోంది. FM radio, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ . అదనపు ఆకర్షణలు.

కెమెరా :

బ్యాక్ కెమెరా విషయానికొస్తే 24, 2, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరాతో వినియోగదారులు మంచి ఫోటోలు తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు .సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 8మెగాపిక్సల్ తో మంచి క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలు తీసుకునేలా కల్పించారు.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ :

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 3400 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English Summary

Huawei P Smart+ (2019) With Triple Rear Camera Setup, Kirin 710 SoC Launched.To Know More About Visit telugu.gizbot.com