బడ్జెట్ ధరలో హువాయి 5G స్మార్ట్‌ఫోన్‌లు... త్వరలోనే అందుబాటులోకి


స్మార్ట్‌ఫోన్‌ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతున్నారు. మీరు వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌తో విసిగిపోతున్నారా? కొత్త దానిని కొనుగోలు చేయాలని చూస్తున్నారా అందులోను 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం ప్రస్తుతం అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది.

ప్రస్తుతం 5Gకి మద్దతు ఇచ్చే స్మార్ట్‌ఫోన్‌ల ధరలు సుమారు రూ.21,000 కంటే ఎక్కువ ఖరీదైనవిగా ఉన్నాయి. అయితే హువాయి సంస్థ 5G మద్దతు గల ఫోన్‌లను బడ్జెట్ ధరలో రూ.10,000 లేదా అంతకంటే తక్కువకే విడుదల చేయనున్నాయి.

వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ ఫీచర్ ను ప్రారంభించడం ఎలా??

ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా రకాల 5G ఫోన్‌ల యొక్క ధర సుమారు రూ .28,500 మించి ఉన్నాయి. ఈ సంవత్సరం మొదటి మాసంలో వివిధ రకాల కంపెనీలు తమ తమ 5G మద్దతు గల ఫోన్ లను విడుదల చేస్తున్నారు. కాకపోతే ఈ 5G ఫోన్‌లు అన్ని కూడా అధిక ధరను కలిగి ఉన్నాయి. ఇవి బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వ్యక్తులకు అందుబాటులో ఉండవు.

నోకియా ఫోన్‌లకు జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌

హువాయి 5G

GizChina నివేదికల ప్రకారం హువాయి యొక్క 5G ప్రొడక్ట్ లైన్ స్మార్ట్‌ఫోన్‌లను 2020 చివరినాటికి లేదా 2021 ప్రారంభంలో సుమారు రూ. 10,600 తక్కువ ధర వద్ద విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ యాంగ్ చావోయింగ్ తెలిపారు.

గ్లాన్స్ లాక్‌స్క్రీన్: షాపింగ్‌ కంటెంట్ ప్లాట్‌ఫాంతో అద్భుతమైన ఫీచర్

5G ఎనేబుల్డ్ చిప్‌సెట్‌

మరింత సరసమైన 5G ఎనేబుల్డ్ చిప్‌సెట్‌లలో మీడియాటెక్ 1000L మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765G వంటి బడ్జెట్ 5G చిప్‌లను బడ్జెట్ ఫోన్ లలో తీసుకురావడానికి హువాయి సంస్థ అడుగులు వేస్తున్నది. సాంకేతికతను చౌకైన ధరలో విస్తరించడానికి 5G ఫోన్‌లు బాగా ఉపయోగపడతాయి.

రోజుకు 3GB డేటాతో వోడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు..... ఆఫర్స్ అదుర్స్

హువాయి 5 జి

2019 లో హువాయి 5 జి ఫోన్ మార్కెట్లో 6.9 మిలియన్ యూనిట్ల విక్రయాలతో చైనాలో మొదటి స్థానంలో ఉంది. చైనాలో మొత్తం 5 జి ఫోన్ అమ్మకపు సంఖ్యలలో ఈ సంఖ్య సగానికి పైగా ఉంది. ఈ పరికరాల్లో మొదటిది ఫోల్డబుల్ హువాయి మేట్ X. మేట్ X లో పరిశ్రమ యొక్క మొదటి 7nm మల్టీ-మోడ్ 5G టెర్మినల్ చిప్ అయిన బలోంగ్ 5000 SoC ని కలిగి ఉంది. చిప్ SA మరియు NSA నెట్‌వర్కింగ్ పద్ధతులకు మద్దతు ఇస్తుంది. ఇది 4G, 3G మరియు 2G వంటి నెట్‌వర్క్ లకు కూడా అనుకూలంగా ఉంటుంది.

గత సంవత్సరం హువాయి సంస్థ విక్రయించిన అదే చిప్‌ను ఉపయోగించే ఇతర పరికరాల్లో హువాయి మేట్ 20X 5G మరియు నోవా 6 5G ని రిలీజ్ చేసారు. తరువాత హువాయి సంస్థ ఫ్లాట్ షిప్ కిరిన్ 990 చిప్‌సెట్‌తో మేట్ 30 సిరీస్‌ను విడుదల చేసింది. కిరిన్ 990 కూడా 5 జి వెర్షన్‌తో లాంచ్ అయింది.

Most Read Articles

Best Mobiles in India
Read More About: news technology smartphone huawei

Have a great day!
Read more...

English Summary

Huawei Plan to Launch Budget 5G Phones