ఈ సారి జియోఫోన్ 2 రికార్డు అమ్మకాలతో దుమ్మురేపింది


సంచలన జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌ కస్టమర్లకు శుభవార్తను అందించిన రోజు అమ్మకాల్లో దుమ్మురేపింది. భారత దేశంలో జియో భారీ అమ్మకాలను నమోదు చేసిందని పేర్కొంది. 215 మిలియన్ వినియోగదారులతో ప్రపంచ రికార్డులను సృష్టించిన జియో లాంచ్‌ చేసిన జియో ఫోన్‌ కీలక మైలురాళ్లను అధిగమించిందనీ, రూ 1,500 ధర పరిధిలో అమ్ముడైన ప్రతి 10 మొబైల్ ఫోన్లలో, 8 జియో ఫోన్లు ఉన్నాయని కంపెనీ ప్రకటించింది.

లీకయిన ఆపిల్ కొత్త ఐఫోన్ల ధరలు, ఈవెంట్ ఎప్పుడంటే ?

జియో ఫోన్ యాప్

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్ జియో ఫోన్ యాప్ అందుబాటులోకి వ‌చ్చిన సంగతి అందరికీ తెలిసిందే. జియో ఫోన్‌లోని ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాట్సప్‌ అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు జియో వెల్లడించింది.

జియో యాప్ స్టోర్‌లోకి వెళ్లి ..

జియో ఫోన్‌, జియో ఫోన్ 2 ఫోన్ల‌ను వాడుతున్న వినియోగ‌దారులు జియో యాప్ స్టోర్‌లోకి వెళ్లి వాట్సప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

సెప్టెంబరు 20 నుంచి..

అనంత‌రం త‌మ ఫోన్ నంబ‌ర్ల‌ను వెరిఫై చేసుకోవ‌డం ద్వారా జియో ఫోన్ యూజ‌ర్లు వాట్సప్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అన్ని జియో ఫోన్లలో సెప్టెంబరు 20 నుంచి వాట్సప్‌ అందుబాటులో ఉంటుందని జియో ఒకప్రకటనలో తెలిపింది.

జియో ఫోన్‌పై సందేహాలను..

జియో ఫోన్‌పై సందేహాలను, సమస్యలను పరిష్కరించేందకు 1991 హెల్ప్‌లైన్‌ కూడా ప్రకటించింది. కాగా యూట్యూబ్‌, వాట్సప్ ,గూగుల్‌ మాప్స్‌ యాప్‌ల‌ను ఆగ‌స్టు 15న‌ అందుబాటులోకి తెస్తామ‌ని జియో ప్ర‌క‌టించింది.

ఫేస్‌బుక్‌, యూట్యుబ్‌..

ఫేస్‌బుక్‌ను జియో ఫోన్లలో ఫేస్‌బుక్‌, యూట్యుబ్‌ను ఆవిష్కరించింది. కానీ ఒక నెల ఆల‌స్యంగా వాట్సప్ యాప్‌ను జియో ఫోన్‌కు అందుబాటులోకి తీసుకురావడం విశేషం.


Read More About: news technology jiophone phone
Have a great day!
Read more...

English Summary

jiophone becomes the largest selling phone in india whatsapp arrives on jiophone more news at Gizbot Telugu