నాలుగు కెమెరాలతో లెనోవో ఎస్5 ప్రో, షావోమి ఎం8 సిరీస్‌కు షాక్ తప్పదా?

లెనోవో ఎస్5 ప్రో (Lenovo S5 Pro) విడుదలకు సిద్థమవుతోన్న నేపథ్యంలో ఈ డివైస్‌కు సంబంధించి ఓ లేటెస్ట్ టీజర్‌ను సంస్థ రివీల్ చేసింది.


లెనోవో ఎస్5 ప్రో (Lenovo S5 Pro) విడుదలకు సిద్థమవుతోన్న నేపథ్యంలో ఈ డివైస్‌కు సంబంధించి ఓ లేటెస్ట్ టీజర్‌ను సంస్థ రివీల్ చేసింది. ఈ టీజర్‌‌లో ఫోన్‌కు సంబంధించిన కెమెరా డిటెయల్స్‌తో పాటు కలర్ వేరియంట్స్ వివరాలను లెనోవో పోస్ట్ చేసింది. షావోమి ఎం8 సిరీస్ ఫోన్‌లకు పోటీగా లాంచ్ కాబోతోన్న లెనోవో ఎస్5 ప్రో శక్తివంతమైన డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో
రాబోతోంది.

Advertisement

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో స్పందించగలిగే ఈ కెమెరాలు 20 మెగా పిక్సల్ అలానే 8 మెగా పిక్సల్ సెన్సార్‌లతో ఎక్విప్ అయి ఉన్నాయి. ఇక రేర్ కెమెరాస్ విషయానికి వచ్చేసరకి 20 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ కాంభినేషన్‌తో కూడిన డ్యుయల్ రేర్ సెటప్‌‌ను లెనోవో ఈ డివైస్‌లో ఎక్విప్ చేసింది. వీటిలో మొదటి సెన్సార్ f/1.8 అపెర్చుర్‌ను క్యారీ చేస్తోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం లెనోవో ఎస్5 ప్రో అక్టోబర్ 18న చైనా మార్కెట్లో లాంచ్ కాబోతోంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.18 ఇంచ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 128జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి శక్తివంతమైన ఫీచర్లను లెనోవో పొందుపరిరచినట్లు తెలుస్తోంది.

 

Advertisement
అక్టోబర్ 16న మరో కొత్త ఫోన్ లాంచ్..

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ఓ పాపులారిటీని సొంతం చేసుకున్న లెనోవో ఉన్నట్టుండి ఇండియాలో సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయి దాదాపుగా ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో లెనోవో గురించి ఓ ఆసక్తికర న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం లెనోవో తన అప్‌కమ్మింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 16న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది.

ద కిల్లర్ రిటర్న్స్..

ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధిచిన మీడియా ఇన్విటేషన్స్‌ను ‘సేవ్ ద డేట్' పేరుతో అన్ని ప్రముఖ మీడియా సంస్థలకు పంపింది. ద కిల్లర్ రిటర్న్స్ అనే ట్యాగ్‌లైన్‌ను కూడా ఈ ఇన్విటేషన్‌లో లెనోవో పొందుపరిచింది. తెలుస్తోంది. ఈ వివరాలను బట్టి చూస్తుంటే లెనోవో తన K-series నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దిపబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఇటీవల చైనా మార్కెట్లో లాంచ్ అయిన లెనోవో జెడ్5 స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్ అయి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Lenovo Z5 ప్రత్యేకతలు..

6.2 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్ 2246 x 1080 పిక్సల్స్ స్ర్కీన్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ విత్ అడ్రినో 509 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్ 5, జీపీఎస్, GLONASS, యూఎస్బీ టైప్-సీ పోర్ట్).

Best Mobiles in India

English Summary

Latest Lenovo S5 Pro teasers reveal camera specs and color variants.To Know More About Visit telugu.gizbot.com