లీకయిన ఆపిల్ కొత్త ఐఫోన్ల ధరలు, ఈవెంట్ ఎప్పుడంటే ?


టెక్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యంలో దూసుకుపోతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ సరికొత్తగా ముందుకు దూసుకువస్తోంది. త్వరలో ఈ కంపెనీ నుంచి అత్యాధునిక ఫీచర్లతో మూడు నూతన స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. కాగా దీనిక సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. కాగా ఈ నెల 12వ తేదీన సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ తన నూతన ఐఫోన్లను విడుదల చేయనున్న విషయం అందరికీ తెలిసిందే.

నంబర్ సేవ్ చేయకుండా వాట్సప్ మెసేజ్ పంపడం ఎలా ?

కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ క్యాంపస్‌లో..

12వ తదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ క్యాంపస్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో గ్యాదర్ రౌండ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

ఆపిల్ తన నూతన ఉత్పత్తులను..

ఇదే ఈవెంట్‌లో ఆపిల్ తన నూతన ఉత్పత్తులను విడుదల చేయనుంది. అయితే మరో రెండు రోజుల్లో విడుదల కానున్న యాపిల్ నూతన ఐఫోన్ల ధరలు ప్రస్తుతం లీకయ్యాయి.

iPhone Xs, iPhone Xc, iPhone Xs Plus

ఈ ఈవెంట్లో iPhone Xs, iPhone Xc, iPhone Xs Plus ఫోన్లను విడుదల చేయవచ్చని సమాచారం. ఐఫోన్ 10సి ఫోన్ ప్రారంభ ధర రూ.61వేలు ఉండనున్నట్లు సమాచారం. అలాగే 10ఎస్ ప్రారంభ ధర రూ.77వేలు, 10ఎస్ ప్లస్ ప్రారంభ ధర రూ.88వేలుగా ఉండనుందని తెలిసింది.

64, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ..

ఇక ఈ మూడు ఫోన్లు 64, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానున్నాయని సమాచారం. అదేవిధంగా ఐఫోఎన్ 10ఎస్, 10ఎస్ ప్లస్ ఫోన్లకు గాను 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను విడుదల చేయవచ్చని తెలిసింది.

డిస్‌ప్లే..

iPhone Xs స్మార్ట్‌ఫోన్ 5.8-inch డిస్‌ప్లే తోనూ, iPhone Xs Plus స్మార్ట్‌ఫోన్ 6.5 inch డిస్‌ప్లే తోనూ రానున్నట్లు తెలుస్తోంది.

వైబో..

ఈ విషయాన్నితొలిసారిగా చైనా టెలికాం ఆపరేటర్ వైబో లీక్ చేసింది. ఆ తరువాత ఈ విషయాలను CNBC రిపోర్ట్ చేసింది.

ఇంటర్నెట్‌లో వస్తున్న ఊహాగానాలే..

అయితే ప్రస్తుతం ఇవన్నీ ఇంటర్నెట్‌లో వస్తున్న ఊహాగానాలే. వీటిలో నిజం ఎంతో తెలియాలంటే ఆపిల్ ఈవెంట్ అయ్యేదాకా ఎదురుచూడక తప్పదు.


Apple iPhone XI Plus

Have a great day!
Read more...

English Summary

Apple iPhone Xs, iPhone Xc and iPhone Xs Plus names and prices leaked online more news at Gizbot Telugu