ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌లో గూగల్ పిక్సల్ 3, ప్రీ-ఆర్డర్స్ పై లభ్యం..

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ ప్రపంచ మార్కెట్లోకి తన కొత్త పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లు ‘పిక్సెల్‌ 3', ‘పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌' లను మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.


సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ ప్రపంచ మార్కెట్లోకి తన కొత్త పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లు 'పిక్సెల్‌ 3', 'పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌' లను మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్మార్ట్‌ఫోన్లను కొనాలని ఆసక్తి ఉన్న వారి కోసం, భారతీ ఎయిర్‌టెల్‌ తన ఆన్‌లైన్‌ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. బుధవారం నుంచి తన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్ల ప్రీ-ఆర్డర్లను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్లను కొనాలిఅనుకున్నవారు కోనాలనుకున్నవారు డౌన్‌పేమెంట్లు కట్టి ఈఎంఐ ప్లాన్లలో వీటిని కొనుగోలు చేయొచ్చని తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడే డేటా, కాలింగ్‌, కంటెంట్‌ ప్రయోజనాలతో కూడిన పోస్టుపెయిడ్‌ ప్లాన్‌ను కంపెనీ అందించనుంది.

Advertisement

ధరలు...

గూగుల్‌ పిక్సెల్‌ 3(64జీబీ) వేరియంట్‌ అసలు ధర రూ.71వేల రూపాయలు, గూగుల్‌ పిక్సెల్‌ 3(128జీబీ) వేరియంట్‌ ధర 80వేల రూపాయలుగా ఉంది. ఇక గూగుల్‌ పిక్సెల్‌ 3ఎక్స్‌ఎల్‌ 64జీబీ వేరియంట్‌ ధర రూ.83వేలు కాగ, 128జీబీ మోడల్‌ ధర రూ.92వేలుగా ఉంది.

Advertisement
ఎయిర్టెల్ ఆన్‌లైన్‌ స్టోర్‌లో డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలంటే...

గూగుల్‌ పిక్సెల్‌ 3 - రూ.17,000
పిక్సెల్‌ 3ఎక్స్‌ఎల్‌(64జీబీ) - రూ.20,000
పిక్సెల్‌ 3ఎక్స్‌ఎల్‌(128జీబీ) - రూ.29,000

పిక్సల్ 3 ప్రత్యేకతలు..

5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే (విత్ 2960 x 1440 పిక్సల్స్), ఆండ్రాయిడ్ Pie ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 మొబైల్ ప్రాసెసర్ విత్ అడ్రినో 630 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12.2 డ్యుయల్ పిక్సల్ సింగిల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ డ్యుయల్ పిక్సల్ ఆటో ఫోకస్, 8 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫేసింగ్ కెమెరా, 2915 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, యాక్టివ్ ఎడ్జ్ సెన్సార్. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీ68 డస్ట్ ఇంకా వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్.

పిక్సల్ 3 ఎక్స్ఎల్ ప్రత్యేకతలు..

6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే (విత్ 2960 x 1440 పిక్సల్స్), ఆండ్రాయిడ్ Pie ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 మొబైల్ ప్రాసెసర్ విత్ అడ్రినో 630 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12.2 డ్యుయల్ పిక్సల్ సింగిల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ డ్యుయల్ పిక్సల్ ఆటో ఫోకస్, 8 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫేసింగ్ కెమెరా, 3430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, యాక్టివ్ ఎడ్జ్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీ68 డస్ట్ ఇంకా వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్.

Best Mobiles in India

English Summary

Now pre-order Google's 'Pixel' smartphones on Airtel Online Store.To Know More About Visit telugu.gizbot.com