OnePlus 3T పై బంపరాఫర్
టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
OnePlus 5 స్మార్ట్‌ఫోన్ విడుదలకు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో OnePlus 3T మోడల్ పై మరో బంపరాఫర్‌ను కంపెనీ అనౌన్స్ చేసింది. జూన్ 12, 07:59:59amలోపు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.1499 ఖరీదు చేసే మొబైల్ కవర్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు OnePlus online store ప్రకటించింది.

OnePlus 3T ఫోన్ మార్కెట్లో లాంచ్ అయి 7 నెలలు మాత్రమే కావొస్తోంది. వన్‌ప్లస్ 5 విడుదల నేపథ్యంలో ఈ ఫోన్‌ను డిస్కంటిన్యూ చేస్తున్నట్లు వన్‌ప్లస్ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి, స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. OnePlus online storeలో ప్రస్తుతానికి మూడు రకాల మొబైల్ కేస్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు సాండ్ స్టోన్ మొబైల్ కేస్ (ఖరీదు రూ.899), కార్బన్ మొబైల్ కేస్ (ఖరీదు రూ.1499), రోజ్‌వుడ్ మొబైల్ కేస్ (ఖరీదు రూ.1499)

OnePlus 3T స్పెసిఫికేషన్స్... 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్ప్లే (పిక్సల్ రిసల్యూషన్ 401 పీపీఐ), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై వన్‌ప్లస్ 3టీ ఫోన్ రన్ అవుతుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 చిప్సెట్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ, 3.5mm headphone jack, 3000 mAh బ్యాటరీ విత్ డాష్ ఛార్జ్ సపోర్ట్.


Click it and Unblock the Notifications