వన్‌ప్లస్ 5జి స్మార్ట్‌ఫోన్ మీద ఈ షాకింగ్ న్యూస్ విన్నారా ?


చైనా హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ 5జి స్మార్ట్‌ఫోన్లను వచ్చే ఏడాదే ప్రవేశపెడతామని ప్రకటించింన సంగతి అందరికీ విదితమే. ఇప్పటికే వన్‌ప్లస్‌ 6టితో హల్‌చల్‌చేస్తున్న సంస్థ తాజాగా వస్తున్న క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 మొబైల్‌ప్లాట్‌ఫామ్‌పై ఈఫోన్లను తయారుచేస్తుందని అంచనా. స్నాప్‌డ్రాగన్‌ టెక్‌ సదస్సులో వన్‌ప్లస్‌ సిఇఒ పీటే లావు మాట్లాడుతూ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 855తో వస్తుందని, వచ్చే ఏడాదే యూరోప్‌లో ప్రారంభిస్తుందని, టెలికాం ఆపరేటర్‌ ఇఇ భాగస్వామ్యంతోనే 5జి ఫోన్లు తెస్తామని వెల్లడించారు. ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్‌గా స్నాప్‌డ్రాగన్‌855 వస్తోందని వెల్లడించారు. అయితే ఈ ఫోన్ మీద ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఈ 22యాప్స్ లో ఏ యాప్ ఉన్న సరే వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేయండి

ధర, స్పీడు

వన్‌ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ ధర చాలా భారీగానే ఉండనుందట. అలాగే ఇది 5జీ స్పీడ్ ని పూర్తి స్థాయిలో అందివ్వలేదట. ఇక దీని ధర వన్‌ప్లస్‌ 6టి కన్నా చాలా ఎక్కువగా ఉండనుందని సమాచారం. లీకయిన వివరాల ప్రకారం $200-$300 మధ్యలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

 

మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీ

కాగా ఈ స్మార్ట్ ఫోన్ మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీని సపోర్ట్ చేయదని కేవలం sub-6GHz bandwidthని మాత్రమే సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. కాగా 2019 సంవత్సరం మధ్యలో కంపెన 5జీ టెక్నాలజీ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

 

యాంటెన్నా టెక్నాలజీ

2019 సెకండ్ హాప్ లో ఫాస్టర్ 5జీ సర్వీసుల కోసం యాంటెన్నా టెక్నాలజీని మెరుగుపరుస్తారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే శాంసంగ్, ఆపిల్, గూగుల్ కంపెనీలు 5జీ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాయి.

 

 

Qualcomm's X50 5G modem

రానున్న 5జీ ఫోన్లో 2 మోడెమ్స్ ( 4G modem and a 5G modem)ని ప్రవేశపెడుతున్నామని కాబట్టి ఈ ఫోన్ పూర్తి స్థాయిలో 5జీని సపోర్ట్ చేయకపోవచ్చని అల్టిమేట్ స్థాయిలె 5జీ స్పీడ్ ఉండకపోవచ్చని సందేహం వ్యక్తం చేశారు. Qualcomm's X50 5G modem మాత్రమే మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుందని తెలిపారు.

 

 

భారత్‌కు సైతం..

కాగా 5జి హ్యాండ్‌సెట్‌ భారత్‌కు సైతం తెస్తామని, వన్‌ప్లస్‌ కీలక మార్కెట్‌ అవుతుందని వన్‌ప్లస్‌ సిఇఒ పీటే లావు వెల్లడించారు. వేగవంతమైన డేటా, డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ వేగం వంటివి ఉంటాయని, అమెరికా,యూరోప్‌, దక్షిణకొరియా, చైనా, ఆస్ట్రేలియాల్లో 2019లోనే ప్రవేశపెడతామని వెల్లడించారు.

 

 


Read More About: news technology smartphone 5g

Have a great day!
Read more...

English Summary

OnePlus 5G smartphone will be expensive, won't offer ultimate 5G speeds more News at Gizbot Telugu