జనవరి 17న ‘Oppo A83’, రూ.15000 సెగ్మెంట్‌లో మరో ఫోన్ రెడీ


ఒప్రో బ్రాండ్ నుంచి కొద్ది రోజుల క్రితం చైనా మార్కెట్లో లాంచ్ అయిన 'Oppo A3' స్మార్ట్‌ఫోన్ మరికొద్ది రోజుల్లో బారత్‌లో లాంచ్ కాబోతోంది. 91మొబైల్స్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ 'Oppo A83' పేరుతో జనవరి 17న భారత్‌లో లాంచ్ కాబోతోంది. మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.15000లోపు ఉండవచ్చని తెలుస్తోంది.

Set Top Box కొనుగోలు చేయాలనుకుంటున్నారా, మీ కోసమే ఈ బెస్ట్ డీల్స్ !

ఒప్పో ఏ83 ఫీచర్స్ అలానే స్పెసిఫికేషన్స్.. 5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (1,440×720 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ23 ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.5GHz), 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, 720 పికల్స్ వీడియో రికార్డింగ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, 3180mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4G VoLTE, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్, గ్లోనాస్, డ్యుయల్ సిమ్), ఫోన్ చుట్టకొలత 150.5×73.1×7.7 మిల్లీ మీటర్లు, బరువు 143 గ్రాములు.

Most Read Articles
Best Mobiles in India
Read More About: smartphones oppo oppo a83 news

Have a great day!
Read more...

English Summary

Oppo in December 2017 launched a new smartphone dubbed as Oppo A3 in China. However new reports on the web now state that the Chinese handset maker will be unveiling the A83 in India on January 17th.