మొబైల్ మార్కెట్‌ని షేక్ చేసే కెమెరాతో వస్తున్న ఒప్పో 10x

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో త్వరలోనే దిగ్గజాలకు షాక్ ఇవ్వనుంది.


మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో త్వరలోనే దిగ్గజాలకు షాక్ ఇవ్వనుంది. ఈ కంపెనీ నుంచి త్వరలో అదిరిపోయే కెమెరాతో ఓ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో ఒప్పో ఈ ఫోన్ ని ప్రదర్శనకు ఉంచింది. 10x పేరుతో రానున్న ఈ మొబైల్ లో తొలిసారిగా 5x hybrid optical zoom systemని పొందుపరిచింది. కాగా ఇ్పటివరకు ఇటువంటి కెమెరా ఫీచర్ తో ఏ కంపెనీ ఫోన్ ని తీసుకురాలేదు. ఈ ఈవెంట్లో టెక్నాలజీని ఎలా వాడుకోవాలనేదనిపై ఒప్పో వివరాలు ఇవ్వనప్పటికీ భారీ స్కెచ్ తోనే 2019ని ప్రారంభించబోతుందని ఈ ఫోన్ ద్వారా చాటి చెప్పింది.

Advertisement

2019లో షియోమి లాంచ్ చేయబోతున్న ఫోన్లు ఇవే...!

hybrid optical zoom technology

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం 10x డివైస్ hybrid optical zoom technologyతో రానుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు ఏకంగా మూడు కెమెరాలను ఈ ఫోన్లో పొందుపరచనున్నారు.

Advertisement
మూడు కెమెరాలు

ఈ మూడు కెమెరాలు కూడా దేనికవే ప్రత్యేకంగా ఉండనున్నాయి. ఓ కెమెరా ultrawide-angleతోనూ మరో కెమెరా ప్రైమరీగానూ మూడవ కెమెరా periscope style setupతో కూడిన telephoto actionతో రానుంది.

1x to 10x

ఈ ఫోన్ మొత్తం 1ఎక్స్ నుంచి 10 ఎక్స్ వరకు అదిరిపోయే డిజైన్ తో రానుందని ఫోటోలను బట్టి తెలుస్తోంది. కాగా కంపెనీ ఇప్పటికే దీని ఉత్పత్తి ప్రారంభించామని తెలిపింది. అయితే కమర్షియల్ గా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని మాత్రం చెప్పలేదు.

 

 

ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ

కాగా ఈ ఈవెంట్లో సరికొత్త ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని ప్రదర్శనలో ఉంచింది. కేవలం మొబైల్ డిస్ ప్లే ద్వారానే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆపరేట్ చేయవచ్చు. రెండు విధాలైన సెక్యూరిటీ ఫీచర్లు ఈ టెక్నాలజీలో భాగం కానున్నాయి.

 

 

ఈ ఏడాది చివరకు అందుబాటులోకి

కాగా ఈ టెక్నాలజీ ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే ప్రదర్శనలో ఫోన్ కి సంబంధించిన వివరాలను మాత్రమే తెలిపారు. ఈ ఫీచర్లతో ఫోన్ రానుందని ఓ చిన్న వీడియో ద్వారా ప్రదక్శన చేశారు. షియోమి కూడా ఈ రకమైన టెక్నాలజీ మీద కసరత్తు చేస్తున్న సంగతి విదితమే.

Best Mobiles in India

English Summary

Oppo announces 10x optical zoom camera and bigger in-display fingerprint scanner more News at Gizbot Telugu