బ్రహ్మాండమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఒప్పో F15 మొదటి సేల్స్


ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ మేకర్ ఒప్పో 2020 సంవత్సరంలో తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ అయిన ఒప్పో F15ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ రోజు నుండి ఇండియాలో దీని యొక్క సేల్స్ గొప్ప ఆఫర్లతో ప్రారంభం కానున్నాయి. ఈ సేల్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్ లైన్ వెబ్ సైట్ లతో సహా దేశంలోని ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా జరుగుతుంది.

ఇది రియల్ మి X2 మరియు వివో S1 ప్రో వంటి వాటికి పోటీగా 20: 9 అమోలెడ్ డిస్‌ప్లే మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్‌లతో రూపొందించబడింది. ఒప్పో F15 స్మార్ట్‌ఫోన్‌ గేమ్ బూస్ట్ 2.0, గేమింగ్ వాయిస్ ఛేంజర్ మరియు ఇన్-గేమ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఎఫెక్ట్స్ వంటి గేమింగ్-ఫోకస్డ్ ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఒప్పో F15 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధర మరియు సేల్స్ యొక్క ఆఫర్ల గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ముందుకు చదవండి.

షియోమి Mi A3అభిమానులకు శుభవార్త... భారీగా తగ్గిన ధర

ధరల వివరాలు

ఇండియాలో ఒప్పో F15 స్మార్ట్‌ఫోన్‌ ను కేవలం ఒకే ఒక 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌తో మాత్రమే విడుదల అయింది. ఈ వేరియంట్ యొక్క ధర 19,990 రూపాయలు. ఈ ఫోన్ ఈ రోజు నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది షైనింగ్ బ్లాక్ మరియు యునికార్న్ వైట్ వంటి రెండు కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ S10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది... ధర కాస్త ఎక్కువే

ఆఫర్స్ వివరాలు

ఒప్పో F15 స్మార్ట్‌ఫోన్‌ యొక్క సేల్స్ ఆఫర్లలో భాగంగా జనవరి 26 వరకు వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ లభిస్తుంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ద్వారా ఫోన్ ను కొనుగోలు చేసే కస్టమర్లకు ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే బజాజ్ ఫిన్‌సర్వ్ వినియోగదారులకు జీరో డౌన్‌పేమెంట్ ఎంపికలు కూడా లభిస్తాయి. చివరిగా జియో వినియోగదారులకు 100 శాతం అదనపు డేటా ప్రయోజనాలు అందించబడతాయి.

Gaganyaan మిషన్ లో హ్యూమనాయిడ్ రోబో.... ఇస్రో సంచలన నిర్ణయం

స్పెసిఫికేషన్స్

ఒప్పో F15 స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై కలర్ ఓఎస్ 6.1.2 తో రన్ అవుతుంది. ఇది 20: 9 కారక నిష్పత్తితో 6.4-అంగుళాల ఫుల్-HD+ అమోలెడ్ డిస్‌ప్లే 1080x2400 పిక్సెల్స్ పరిమాణంలో ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P70 (MT6771V) SoC తో రన్ అవుతూ Mali G72 MP3 GPU మరియు 8GB LPDDR4x ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది.

ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా మొబైల్ చందాదారులకు బ్యాడ్ న్యూస్

కెమెరా

ఫోటోలు మరియు వీడియోల కోసం ఒప్పో F15 స్మార్ట్‌ఫోన్‌ లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో పాటు ఎఫ్ / 2.25 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఫీల్డ్-ఆఫ్-వ్యూ (FoV) 119 డిగ్రీలతో మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌లతో పోర్ట్రెయిట్ మరియు మోనోక్రోమ్ షాట్‌లను తీయడానికి ఫోన్‌లో రెండు 2-మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి . సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉంది.

బడ్జెట్ ధరలో హువాయి 5G స్మార్ట్‌ఫోన్‌లు... త్వరలోనే అందుబాటులోకి

ఫీచర్స్ -కనెక్టివిటీ

ఒప్పో F15 స్మార్ట్‌ఫోన్‌ లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అధిక మెమొరీ కోసం మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v4.2, GPS / A-GPS, USB టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, పెడోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. అంతేకాకుండా ఇది VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇచ్చే 4,000mAh బ్యాటరీతో ఈ ఫోన్ ప్యాక్ చేయబడి వస్తుంది.

Most Read Articles

Best Mobiles in India
Read More About: news technology smartphone oppo

Have a great day!
Read more...

English Summary

Oppo F15 Sales Start Today: Price And Offers