శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ51, ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి


దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ51ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను రూ.24,485 ప్రారంభ ధరకు వినియోగదారులు డిసెంబర్ 27వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇందులో.. 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్, 48, 12, 5, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. దీంతో పాటుగా శాంసంగ్ నుంచి ఈ మధ్య వచ్చిన ఫోన్లను ఓ సారి చూద్దాం.

Advertisement

Samsung Galaxy M30s

4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.13,999 ధరకు, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.16,999 ధరకు అందిస్తున్నారు. అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ షాప్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో... 6.4 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0, డ్యుయల్ సిమ్, 48, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Advertisement
Samsung Galaxy Note 10, 10 Plus

భారత్‌లో గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఫోన్ల ధరలను కూడా శాంసంగ్ వెల్లడించింది. 

* శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 (8జీబీ + 256జీబీ) - రూ.69,999

* శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ (12జీబీ + 256జీబీ) - రూ.79,999

* శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ (12జీబీ + 512జీబీ) - రూ.89,999

Samsung Galaxy A50s

4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.22,999 ఉండగా, 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.24,999 గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎ50ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.4 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Samsung Galaxy S10, S10 Plus

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌10ఇ - 6జీబీ+128జీబీ - రూ.55,900

* శాంసంగ్ గెలాక్సీ ఎస్10 - 8జీబీ+128జీబీ - రూ.66,900

* శాంసంగ్ గెలాక్సీ ఎస్10 - 8జీబీ+512జీబీ - రూ.84,900

* శాంసంగ్ గెలాక్సీ ఎస్10ప్ల‌స్ - 8జీబీ+128జీబీ - రూ.73,900

* శాంసంగ్ గెలాక్సీ ఎస్‌10ప్ల‌స్ - 8జీబీ+512జీబీ (సెరామిక్ బ్లాక్‌) - రూ.91,900

* శాంసంగ్ గెలాక్సీ ఎస్10ప్ల‌స్ - 12జీబీ+1 టీబీ (సెరామిక్ వైట్‌) - రూ.1,17,900

Samsung Galaxy M40

ధర రూ. 19,990

శాంసంగ్ గెలాక్సీ ఎం40 ఫీచర్లు

* 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

* 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్

* 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

* ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

* 32, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్

* యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ

* బ్లూటూత్ 5.0, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Best Mobiles in India

English Summary

Samsung Galaxy A51 launched with 48MP quad rear cameras, Full HD+ Infinity-O AMOLED display