అదిరిపోయే ఫీచర్లతో మూడు ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయింది. తాజాగా కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లు Galaxy S10, Galaxy S10 Plus,S10 e లను విడుదల చేసింది.


దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయింది. తాజాగా కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లు Galaxy S10, Galaxy S10 Plus,S10 e లను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్లు ఇతర దిగ్గజ కంపెనీ ఫోన్లకు గట్టిపోటీనిస్తాయని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు.ఈ S10 స్మార్ట్‌ఫోన్‌లో 6.1 అంగుళాల డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 12+16+12 ఎంపీ ట్రిపుల్ రియర్‌ కెమెరాలు , 10 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,400 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇక S10 Plus 6.3 అంగుళాల డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 12+16+12 ఎంపీ ట్రిపుల్ రియర్‌ కెమెరాలు , 10+8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాలు , 4,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి అలాగే S10 e స్మార్ట్‌ఫోన్‌లో 5.8 అంగుళాల డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 12+16 ఎంపీ డ్యూయల్ రియర్‌ కెమెరాలు , 10 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయిమొత్తం ఫీచర్లపై ఓ లుక్కేయండి

Advertisement

గోవా వెళితే మ్యాప్ మీద ఆధారపడకండి, కొంప కొల్లేరు చేసుకోకండి

ధరలు

Galaxy S10 ధర రూ. 64,450
Galaxy S10 Plus ధర రూ.72,517
Galaxy S10 e ధర రూ.53,964

Advertisement
Galaxy S10 ఫీచర్లు

6.1 అంగుళాల డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12+16+12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Galaxy S10 Plus ఫీచర్లు

6.3 అంగుళాల డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12+16+12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు , డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Galaxy S10 e ఫీచర్లు

5.8 అంగుళాల డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12+16 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English Summary

Samsung Galaxy S10, S10+, S10 e to launch today: Here’s how to watch the livestream.To Know More About Visit telugu.gizbot.com