వివో స్మార్ట్‌ఫోన్ల పై బంపర్‌ ఆఫర్లు త్వరపడండి

ఈ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఫెస్టివల్‌ సేల్స్‌తో అదరగొట్టిన వెంటనే, స్మార్ట్‌ఫోన్ల కంపెనీ వివో కూడా కార్నివల్‌ సేల్‌కు తెరలేపింది.


ఈ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఫెస్టివల్‌ సేల్స్‌తో అదరగొట్టిన వెంటనే, స్మార్ట్‌ఫోన్ల కంపెనీ వివో కూడా కార్నివల్‌ సేల్‌కు తెరలేపింది. తన ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఈ సేల్‌ను నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా తమ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌, అక్టోబర్‌ 18 వరకు కొనసాగుతోంది. నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు, బైబ్యాక్‌ ఆఫర్లు, హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు, ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై వన్‌-టైమ్‌ స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ డీల్‌, ధర తగ్గింపు వంటి ఆఫర్లను అందిస్తోంది. ఈ శీర్షిక లో భాగంగా డిస్కౌంట్లో లభిస్తున్న ఫోన్ల వివరాలను మీకు తెలుపుతున్నాము . ఓ లుక్కేయండి.

Advertisement

వివో వీ9 ప్రొ

అసలు ధర రూ. 19,990
ప్రస్తుత ధర రూ. 17,990
అలాగే రూ.8,995 క్యాష్‌బ్యాక్‌ను, నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇస్తోంది. జియో కూడా పనిలో పనిగా రూ.4,050 విలువైన ప్రయోజనాలను ఆఫర్‌ చేస్తోంది

ఫీచర్లు...
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,13,2 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు,డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4జీ వీవోఎల్‌టీఈ,3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Advertisement
వివో వీ11 ప్రొ

6జీబీ ర్యామ్‌ వేరియంట్‌ కార్నివల్‌ సేల్‌లో రూ.25,990కు లిస్ట్‌ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ఉచితంగా బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్లు, వన్‌ టైమ్‌ స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌, వొడాఫోన్‌ యూజర్లకు 250జీబీ వరకు డేటా, జియో యూజర్లకు రూ.4050 విలువైన ప్రయోజనాలు, నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉన్నాయి.

ఫీచర్లు...
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ,ఫాస్ట్ చార్జింగ్.

 

వివో వీ11

6జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ప్రస్తుతం రూ.20,990గా లిస్ట్‌ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ఉచితంగా బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్లు, వన్‌ టైమ్‌ స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌, వొడాఫోన్‌ యూజర్లకు 250జీబీ వరకు డేటా, జియో యూజర్లకు రూ.4050 విలువైన ప్రయోజనాలు, నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉన్నాయి.

ఫీచర్లు...
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3315 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

వివో వీ5

అసలు ధర రూ. 18,990
ప్రస్తుత ధర రూ. 15,990

ఫీచర్లు...
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, మాలి టి860 గ్రాఫిక్స్,4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్,20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1,3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

వివో వీ9 యూత్‌

డిస్కౌంట్‌లో రూ.13,990కు లభ్యమవుతోంది

ఫీచర్లు...
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,,1. 8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ cortex A53 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo ,16 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 16 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

వివో వై66

అసలు ధర రూ. 14,990
ప్రస్తుత ధర రూ. 7,990

ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే,1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్,32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్,16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0,3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English Summary

Vivo Carnival Sale Kicks Off With Deals on Vivo V9 Pro, V11 Pro, and More.To Know More About Visit telugu.gizbot.com