హై-లైట్ కెమెరా ఫీచర్ తో ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన Vivo V15 Pro

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ ఏడాది అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారనుంది.


స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ ఏడాది అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారనుంది. టాప్ కంపెనీల బెజిల్ లెస్ స్మార్ట్ ఫోన్లు ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లేతో పాటు ఆకట్టుకునే స్క్రీన్ బాడీ రేషియోతో మొబైల్ మార్కెట్లోకి దూసుకువచ్చాయి. యూజర్ల చేతిలో ఫోన్ ఇట్టే ఇమిడిపోయిన ఈ ఫోన్లు వినియోగదారులకు అదిరిపోయే మల్టీ మీడియా అనుభవాన్ని అందిస్తున్నాయి. అన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్లను దూసుకొస్తున్న నేపథ్యంలో వివో కంపెనీ కూడా యూజర్లకి అద్భుతమైన అనుభూతిని అందించేందుకు కొత్త స్మార్ట్ ఫోన్లతో రంగంలోకి దిగుతోంది. ఇందులో భాగంగానే వివో Vivo V15 Proను ఈ రోజు ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది.పాప్ అప్ కెమెరా ప్రధాన ఆకర్షణగా వచ్చిన ఈ ఫోన్ యూజర్లను అమితంగా ఆకట్టుకోబోతుంది.

Advertisement

అదిరిపోయే ఫీచర్లతో మూడు ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్

Advertisement

ప్రీ బుకింగ్ ఈ రోజు నుంచి మొదలు కానున్నాయి

ఈ ఫోన్ రూ.28,990 ధరకు లభ్యం కానుంది.ఈ ఫోన్ యొక్క ప్రీ బుకింగ్స్ ఈ రోజు నుంచి మొదలు కానున్నాయి .మార్చ్ 6వ తేదీ నుంచి Amazon.in, Flipkart, Paytm Mall, Snapdeal, మరియు Vivo India online store లో ఈ ఫోన్ యొక్క సేల్స్ మొదలు కానున్నాయి.

టొపాజ్ బ్లూ, రూబీ రెడ్ కలర్స్‌లో

టోపాజ్ బ్లూ ,రూబీ రెడ్ కలర్స్‌లో 6 జీబీ ర్యామ్ తో ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. Vivo V15 Pro స్మార్ట్‌ఫోన్‌లో 6.39 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.

అమోల్డ్ డిస్ ప్లే

స్క్రీన్ టు బాడీ రేషియో 91.24 శాతం ఉన్నందున ఫోన్ డిస్‌ప్లే పూర్తిగా అంచుల వరకు ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో పై భాగంలో డిస్‌ప్లే కింద మైక్రో స్లిట్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల దాంట్లో ఉండే 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా యూజర్ కావాలనుకున్నప్పుడు పైకి ఓపెన్ అవుతుంది. దాంతో ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు.

ట్రిపుల్ రియర్ కెమెరాలు

Vivo V15 Pro ట్రిపుల్ రేర్ కెమెరాతో వచ్చింది.48MP+12MP+5MP rear cameraతో అదిరిపోయే ఫోటోలను షూట్ చేయవచ్చు. అంతే కాకుండా సెట్టింగ్స్ అడ్జెటమెంట్లో కొన్ని మార్పులను తీసుకువచ్చింది. షార్ప్ నెస్, బ్రైట్ నెస్ విభాగంలో ఈ ఫోన్ ఇతర ఫోన్లకు ధీటుగా వచ్చింది.

హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్

Snapdragon 675 CPUతో పాటు 6జిబి ర్యామ్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ వచ్చింది. ఆండ్రాయిడ్ 9.0 పై తో ఈ ఫోన్ యూజర్లను అలరించనుంది.

ఫీచర్లు

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యుయ‌ల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్‌.

 

 

Best Mobiles in India

English Summary

Vivo V15 Pro With Triple Rear Cameras, Pop-Up Selfie Camera Launched in India: Price, Specifications.To Know More About Visit telugu.gizbot.com