మార్చ్19న మొబైల్ మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్న వివో

మొబైల్ రంగంలో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజం వివో మునుపెన్నడూ లేని టెక్నాలజీతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది


మొబైల్ రంగంలో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజం వివో మునుపెన్నడూ లేని టెక్నాలజీతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.కాగా Vivo X27 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేయనుంది.గతంలో వచ్చిన Vivo X23 కి సక్ససర్ గా ఈ Vivo X27 ను కంపెనీ లాంచ్ చేయబోతుంది.మార్చి 19 న లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు వెవోబో ద్వారా వివో చైనా అధికారికంగా ప్రకటించింది.

Advertisement

రైలు ప్రయాణీకులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన IRCTC

6.39 ఇంచుల భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే..

Vivo X27 స్మార్ట్‌ఫోన్‌లో 6.39 ఇంచుల భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేయనున్నారు . ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభించనుంది. ఇక ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే 48, 13,5 మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరాలు ఇందులో ఏర్పాటు చేయనున్నారు

Advertisement
ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్..

దీని వల్ల డిస్‌ప్లే పైనే యూజర్లు చేతి వేలితో ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీంతో డివైస్ అన్‌లాక్ అవుతుంది. దీన్ని ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అని వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.

Vivo X27 ఫీచర్లు (అంచనా)

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ (2.2 GHz, డ్యూయల్ కోర్ , Kryo 360 + 1.7 GHz, హెక్సా కోర్ , Kryo 360) ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 13,5 మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3920 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

గతంలో వచ్చిన వివో Vivo X23 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి

6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో , 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English Summary

Vivo X27 to launch in China on March 19: Here's everything we know so far.To Know More About Visit telugu.gizbot.com