షియోమి నుంచి 48 మెగా పిక్సల్‌ కెమెరాతో స్మార్ట్‌ఫోన్..


స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తున్న తరుణంలో ఇప్పుడు అన్ని కంపెనీలు కొత్తగా ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు అత్యాధునిక కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఆపిల్ ఐఫోన్ 1 ఎంపి ఇమేజ్ సెన్సార్ తో అలాగే లార్జ్ పిక్సల్ తో ప్రైమరీ కెమెరాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మిగతా కంపెనీలు హయ్యర్ రిజల్యూషన్ తో తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో షియోమి ఓ అడుగు ముందుకేసింది. 48 ఎంపీ మెగా ఫిక్సల్ తో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

ఛార్జింగ్ పెట్టి పాటలు విన్నాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు

హువాయి ఫోన్ల సెన్సార్

ఇప్పుడు కెమెరా విభాగంలో హువాయి ఫోన్లదే మార్కెట్లో ఆధిపత్యంగా ఉంది.ఈ కంపెనీ నుంచి వచ్చిన Huawei P20 Pro, Huawei Mate 20 Pro ఫోన్లు 40 ఎంపీ సెన్సార్ కెమెరాతో పాటు ప్రైమరీ కెమెరాతో కూడా మార్కెట్లోకి వచ్చాయి.

షియోమి పోటీ

హువాయి ఫోన్లకు పోటీగా షియోమి కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో ఓ టీజర్ ని వదిలింది. 48 ఎంపీ సెన్సార్ తో షియోమి నుంచి కెమెరా ఫోన్ రాబోతోందని ఈ టీజర్ సారాంశం. అయితే దీనికి సంబంధించిన వివరాలేమి బహిర్గతం కాలేదు. కాగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ దీనికి సంబంధించిన ఓ ఇమేజ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ వైరల్ అయింది.

Sony's IMX586 సెన్సార్

ఈ లీకయిన ఇమేజ్ ప్రకారం రానున్న షియోమి ఫోన్ 48 ఎంపీ Sony's IMX586 సెన్సార్ తో ఫోన్ రానుందని తెలుస్తోంది. ప్రతి పిక్సల్ సైజు 0.8umగా ఉండనుంది. అయితే ఈ సెన్సార్ HDR,low-light photographyకి అంత మంచి న్యూస్ కాదని తెలుస్తోంది. ఎందుకంటే హువాయి తన ఫోన్లలో 4-megapixel sensorsని ప్రవేశపెట్టింది. తద్వారా pixel binning టెక్నాలజీతో కెమెరా సమస్యను అధిగమించినట్లయింది.

48-megapixel sensor

అయితే రానున్న షియోమి ఫోన్ 48-megapixel sensorతో పాటు ఫోటోగ్రఫీ అభిమానుల కోసం కొన్ని ప్రత్యేక ఫీచర్లను యాడ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లైటింగ్ అంతగా లేని చోట కూడా ఫోటోలు అందంగా వచ్చేలా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు సమాచారం.

 

 

అదేబాటలో ఇతర కంపెనీలు

ఇప్పుడు హువాయి బాటలోనే ఇతర కంపెనీలు నడుస్తున్నాయి. OnePlus, Nokia, Oppo, Vivo and Huawei లాంటి దిగ్గజాలు 48 ఎంపీ కెమెరా ఫోన్ మీద ప్రత్యేక శ్రద్ధను పెట్టినట్లు తెలుస్తోంది. కాగా రానున్న షియోమి ఫోన్లో Qualcomm Snapdragon 855 processor ఉండే అవకాశం ఉంది.

 

 


Read More About: news technology mobiles xiaomi

Have a great day!
Read more...

English Summary

Xiaomi confirms it will launch phone with 48-megapixel camera in January More News at Gizbot Telugu