షియోమి స్మార్ట్‌ఫోన్ల పై అదిరిపోయే డిస్కౌంట్లు


షియోమి మరియు అమెజాన్ కలిసి "I love Mi" పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది . డిసెంబరు 6న మొదలైన ఈ సేల్ ఈ రోజుతో ముగియనుంది. ఈ సేల్ లో భాగంగా ఎంఐ ఏ2, రెడ్‌ మి వై2,ఎంఐ 6ఏ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో పాటు ఈఎమ్ఐ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల మీద 10 శాతం డిస్కౌంటు ఉంటుంది. ఇక జియో షియోమి ఫోన్ల కొనుగోలు మీద 4.5 TB 4G dataని క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తోంది. అలాగే అమెజాన్ లో ఫస్ట్ ఆన్ లైన్ పేమెంట్ చేసేవారు 50 శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందుతారు. ఆఫర్లను ఓ సారి పరిశీలిస్తే..

ఇక కంటి గ్లాసెస్‌తో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు

Xiaomi Mi A2

లాంచ్ ధర :రూ. 16,999
ప్రస్తుత ధర :రూ. 14,999

ఫీచర్లు...

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 660 ఎస్‌వోసీ, ప్రాసెసర్‌, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Redmi Y2

లాంచ్ ధర :రూ. 10,999
ప్రస్తుత ధర :రూ. 8,999

ఫీచర్లు...

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

 

Redmi 6A

లాంచ్ ధర :రూ. 6,999
ప్రస్తుత ధర :రూ. 5,999

ఫీచర్లు...

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 


Have a great day!
Read more...

English Summary

Xiaomi I Love Mi sale sees discounts on Mi A2, Redmi 6A and more until Dec 8.To Know More About Visit telugu.gizbot.com