షియోమి నుంచి రాబోతున్న మరో సంచలన స్మార్ట్‌ఫోన్ Xiaomi Mi 8 Youth


చైనా దిగ్గజం షియోమి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు షియోమి కంపెనీ త్వరలో లాంచ్ చేయబోతున్న ఫోన్ వివరాలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. షియోమి Mi 8 Youth పేరుతో కంపెనీ ఈ సరికొత్త ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ నెల 19న చైనా మార్కెట్లో లాంచ్ చేయనుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే ఈ ఫోన్ గతంలో వచ్చిన Mi 8,Mi 8 Explorer Edition,Mi 8 SE కి కొనసాగింపుగా మార్కెట్లోకి రాబోతుంది. లీకైన ఫీచర్లను ఒకసారి పరిశీలిస్తే....

మూడు వేరియంట్లలో...

ఈ షియోమి Mi 8 Youth 4 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మరియు 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉండనుంది.

టాప్‌-నాచ్‌ డిస్‌ప్లే...

Mi 8 Youth స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరిగా టాప్‌-నాచ్‌ డిస్‌ప్లేను కలిగి ఉందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీనా లిస్టింగ్‌ కూడా అంతకముందే రివీల్‌ చేసింది.

టీనా లిస్టింగ్‌ ప్రకారం...

టీనా లిస్టింగ్‌ రివీల్‌ చేసిన దాని ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌కు 6.26 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ సీపీయూ, 2.8 గిగాహెడ్జ్‌, 24ఎంపీ ఫ్రంట్‌ కెమెరా 12MP+8MP బ్యాక్ కెమెరా ఉంటుందని తెలుస్తుంది.

షియోమి Mi 8 Youth ఫీచర్లు...

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12,8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3250 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

గతంలో వచ్చిన Mi 8 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

గతంలో వచ్చిన Mi 8 Explorer Edition ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి..

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 3డీ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ , డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

గతంలో వచ్చిన Mi SE ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

5.88 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 3డీ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ , డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3120 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Have a great day!
Read more...

English Summary

Xiaomi Mi 8 Youth confirmed to be launched on September 19 in China.To Know More About Visit telugu.gizbot.com