అబ్బురపరిచే ఫీచర్లతో మార్కెట్లోకి లాంచ్ కానున్న షియోమి ఎంఐ 9

చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమి నుంచి మరో ఫోన్ రిలీజ్ కాబోతోంది. షియోమి లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షియోమి ఎంఐ 9 స్మార్ట్ ఫోన్ ఈ రోజు చైనా మార్కెట్లో లాంచ్ కానుంది.


చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమి నుంచి మరో ఫోన్ రిలీజ్ కాబోతోంది. షియోమి లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షియోమి ఎంఐ 9 స్మార్ట్ ఫోన్ ఈ రోజు చైనా మార్కెట్లో లాంచ్ కానుంది. భార‌త కాల‌మానం ప్రకారం ఈ రోజు ఉద‌యం 11.30 గంట‌ల‌కు ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ జరగనుంది. షియోమి నుంచి వచ్చిన ఎంఐ 8 సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఇప్పటికీ ఈ మోడల్ టాప్ సెల్లింగ్ ఫోన్లల్లో ఉండటం విశేషం. ఇప్పుడు దాని అప్‌గ్రేడ్ వర్షన్ అయిన ఎంఐ 9 మార్కెట్లోకి వచ్చేస్తోంది.

Advertisement

ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం

6.4 ఇంచుల డిస్‌ప్లే

ఈ షియోమి ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్ 6.4 ఇంచుల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (2880 x 1440 పిక్సల్స్) ప్యానల్‌తో వస్తోంది. ఎడ్జ్ టు ఎడ్జ్ 18.7:9 యాస్పెక్ట్ రేషియో కారణంగా ఈ డివైస్ గ్రాఫికల్ కంటెంట్‌ను స్టన్నింగ్ విజువల్స్‌తో అందిస్తుంది.స్మార్ట్ మొబైలింగ్‌తో పాటు మల్టీ మీడియా అవసరాలను తీర్చుకునేందుకు ఈ ఫోన్‌ను ఒక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

Advertisement
నాలుగు కెమెరాలు

ఇందులో నాలుగు కెమెరాలు అమర్చారు . ఫోన్ వెనుక భాగంలో 48,12,16 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉన్నాయి ఉన్నాయి.ముందు భాగంలో 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా అమర్చారు

బ్యాటరీ,ఆండ్రాయిడ్,ప్రాసెసర్

షియోమి ఎంఐ 9 ఫోన్ 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.సింగిల్ ఛార్జ్ పై రోజుంతా వచ్చే ఈ బ్యాటరీ హెవీ యూసేజ్‌కు వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 2.5 గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ కఠినమైన టాస్కులను సైతం సునాయాశంగా పూర్తి చేయగలుగుతుంది. ఆండ్రాయిడ్ 9.0 'పై' పై ఫోన్ రన్ అవుతుంది.

షియోమి ఎంఐ 9 ఫీచర్లు

6.4 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌, స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 48, 16 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 12, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, ఆండ్రాయిడ్ 9.0 పై, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ

గతంలో వచ్చిన షియోమి ఎంఐ8 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English Summary

Xiaomi Mi 9 Launch LIVE Updates: Triple cameras, Qualcomm Snapdragon 855 processor.To Know More About Visit telugu.gizbot.com