షియోమి నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్, రెడ్ మి కె‌30పై ఓ లుక్కేసుకోండి


చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ కె30 5జీని చైనాలో విడుదల చేసింది. ఇక ఇదే ఫోన్‌కు షియోమీ 4జీ వేరియెంట్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా దీనికి 120 గిగాహెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుండడం విశేషం. అలాగే ఇందులో ప్రపంచంలోనే తొలిసారిగా స్నాప్‌డ్రాగన్ 765జి 5జీ చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇక 4జీ వేరియెంట్‌లో స్నాప్‌డ్రాగన్ 730జి చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ 5జీ ఫోన్ ఇండియాకి అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

Advertisement

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 20, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న కెమెరాలు రెండు ఉన్నాయి. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. 4500 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉండగా దీనికి 30వాట్ల ఫ్లాష్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 

Advertisement

ఫోన్ ప్రారంభ ధర రూ.16,100 ఉండగా, హై ఎండ్ వేరియెంట్ ధర రూ.29,200 వరకు ఉంది. ఈ ఫోన్‌ను డిసెంబర్ 12వ తేదీ నుంచి చైనాలో విక్రయించనున్నారు. 2020 జనవరి నుంచి ఈ ఫోన్‌కు చెందిన 5జీ వేరియెంట్‌ను విక్రయించనున్నారు. ఇండియాకు ఎప్పుడనేది కంపెనీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. 

6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 765జి ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10,హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 64, 8, 2, 5 బ్యాక్ కెమెరాలు,20, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్,డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ,యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10,హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 64, 8, 2, 5 బ్యాక్ కెమెరాలు,20, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్,డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ,యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Best Mobiles in India

English Summary

Xiaomi Redmi K30 smartphone launched in China: Specs,Specs, prices and more