బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను మూలకు పంపిస్తున్న అసలు సిసలు ఫోన్ ఇదే

చైనా మొబైల్ కింగ్ మేకర్ షియోమి లేటెస్ట్ గా రెడ్‌ మి నోట్‌ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.


చైనా మొబైల్ కింగ్ మేకర్ షియోమి లేటెస్ట్ గా రెడ్‌ మి నోట్‌ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా వాటిని షియోమి రెడ్‌మి నోట్ 7 మరియు రెడ్‌మి నోట్ 7 ప్రో పేరిట లాంచ్ చేసింది.చాలా తక్కువ ధరకే లాంచ్ అయిన ఈ ఫోన్లు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ క్యాటగిరీలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయనున్నాయి.

Advertisement

మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్లు ఇప్పటికే కొత్త ట్రెండ్ ను సృష్టించింది. షియోమి రెడ్‌మి నోట్ 7 మొదటి ఫ్లాష్ సేల్ Flipkart.com, Mi.com, and Xiaomi's official stores- Mi Home stores ద్వారా 2,00,000 యూనిట్లను విక్రయించగలిగింది.

Advertisement

షియోమి రెడ్‌మి నోట్ 7 ఫీచర్స్

ఇందులో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 12, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 13 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీని ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఇక డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు.

ఈ లేటెస్ట్ రెడ్‌మి నోట్ 7 సిరీస్ ఫోన్లు తాజా MIUI 10 ఆధారంగా ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. అలాగే షియోమి కంపెనీ స్మార్ట్‌ఫోన్ ఎక్స్పీరియన్స్ చాలా సహజమైన మరియు యూజర్ ఫ్రెండ్లీ చేసే కొన్ని కొత్త మరియు ఉపయోగకరమైన సాఫ్ట్ వేర్ ఫీచర్స్ ను జోడించారు.

వీటిలో 'డ్యూయల్ యాప్స్ ' ఉన్నాయి, ఇది ఒకే అప్లికేషన్ లో ఏకకాలంలో రెండు ఖాతాలను అమలు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 'permissions' లో ఫోన్ యొక్క హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ లక్షణాల వినియోగాన్ని పరిమితం చేయడానికి యాప్ పెర్మిషన్స్ మీరు నిర్వచించగలరు.మీరు లేనప్పుడు అన్ ఆథరైజ్డ్ యాక్సిస్ ప్రెప్ప్రెవెంట్ చేయడానికి వ్యక్తిగత యాప్ లాకులు కూడా అమర్చవచ్చు

 

 

లాక్ స్క్రీన్

లాక్ స్క్రీన్ కూడా కొత్త అప్ గ్రేడ్ పొందింది. షియోమి ఒక కొత్త వాల్ పేపర్ Carouselను జతచేసింది లాక్ స్క్రీన్ తేడా తో ఒక విజువల్ మేక్ ఓవర్ ను ఇస్తుంది. .ఫుల్ వీవింగ్ ఎక్స్పీరియన్స్ ను అనుభవించడానికి మీరు థీమ్స్ సెట్ చేయవచ్చు. రిచ్ థీమ్ స్టోర్ కొత్త థీమ్స్, వాల్ పేపర్లు, ఐకాన్స్ ను ఇన్స్టాల్ చేయడానికి కొన్నింటిని అనుమతిస్తుంది.

అద్భుతమైన యూజర్ అనుభవాన్ని అందిస్తుంది

ఈ ఫోన్ అద్భుతమైన యూజర్ అనుభవాన్ని అందిస్తుంది.మీరు ఎప్పుడు ఫోన్ ను చూసిన అదంతటఅదే కొత్త వాల్ పేపర్ ను చేంజ్ చేస్తుంది.ఇలాంటి కొత్త కంటెంట్ తో పాటు మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టెయిన్ చేస్తుంది. సమాచారం చదివినప్పుడు, మీరు వరుసగా ఫోన్ యొక్క నోటిఫికేషన్లను మరియు సెట్టింగ్లను యాక్సిస్ చేయడానికి ఎడమ మరియు కుడికి స్వైప్ చేయగలరు. షియోమి భవిష్యత్తులో ప్రతి మొబైల్ కు ఈ ఫీచర్ అందిస్తే చాలా బాగుంటుంది.

వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ

వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ క‌లిగిన కెమెరాను అమ‌ర్చారు. ముందు భాగంలో 13 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. దీనికి ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ల్యాపీకి సమానంగా ఇందులో కెమెరా ఫీచర్ ఉంది. రిజల్యూషన్ ఫోటోలు తీసినప్పుడు దాని స్పేస్ కూడా తక్కువగా తీసుకుంటుంది. 48 ఎంపి ఫోటోలకు 15-19MB సైజులోనూ అలాగే 12 ఎంపి కెమెరాకు 6-8MB సైజులోనూ వస్తాయి.నైట్ మోడ్లో వెలుతురులోనూ ఫోటోలు తీసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఫోన్ కెమెరాలో నైట్ మోడ్ ఫీచర్ ని ప్రవేశపెట్టారు.రెడ్‌మి నోట్ 7 ప్రొ కూడా అదే సాఫ్ట్ వేర్ ఫీచర్లు, డిస్‌ప్లే మరియు బ్యాటరీ శక్తి కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English Summary

Xiaomi Redmi Note 7 sets new benchmarks in budget smartphone category.To Know More About Visit telugu.gizbot.com