రెడ్‌మి నోట్ 7 ట్విట్టర్ ఛాలెంజ్, ఈ ప్రశ్నలకు జవాబులు ఇస్తే..

చైనా మొబైల్ మేకర్ షియోమి తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రెడ్‌మి నోట్ 7ను ఈ నెల 28న లాంచ్ చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే.


చైనా మొబైల్ మేకర్ షియోమి తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రెడ్‌మి నోట్ 7ను ఈ నెల 28న లాంచ్ చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా కంపెనీ నుంచి తొలిసారిగా 48 ఎంపి కెమెరాతో ఈ ఫోన్ దూసుకొస్తోంది. ఇప్పటికే లాంచ్ ఈవెంట్ కోసం టికెట్లను కూడా అమ్మేసింది. ఈ టికెట్ ధరను రూ.480గా నిర్ణయించింది. ఇదిలా ఉంటే ఈ చైనా దిగ్గజం ట్విట్టర్లో ఓ ఫోటో షేర్ చేసింది. యూజర్లు రెడ్ మి నోట్ 7 ఛాలంజ్ కాంటెస్ట్ లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఈ కాంటెస్ట్ వివరాలను ఓ సారి చూద్దాం.

Advertisement

గోవా వెళితే మ్యాప్ మీద ఆధారపడకండి, కొంప కొల్లేరు చేసుకోకండి

రెడ్ మి ఇండియా ట్విట్టర్

రెడ్‌మి ఇండియా ట్విట్టర్లో రెడ్‌మి నోట్ 7 రిలీజ్ సందర్భంగా ఓ చాలెంజింగ్ కాంటెస్ట్ పెట్టింది. ఇందులో #ǝɟᴉ7ƃnɥʇ 7తో కూడిన 7 నంబర్ ని ఉంచింది. అందులో కొన్న ప్రశ్నలను ఉంచింది. దీన్ని షేర్ చేయడం ద్వారా కొన్ని గాడ్జెట్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

Advertisement
షియోమీ రెడ్‌మి నోట్‌7 ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

రెడ్‌మి నోట్‌7 కెమెరా

రెడ్‌మి నోట్‌7లో 48 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న భారీ కెమెరాను అమర్చగా మూడు వేరియంట్లలో బ్లాక్‌, బ్లూ, ప‌ర్పుల్ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో లభించనుంది. 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

 

 

రెడ్‌మి నోట్‌7 స్టోరేజ్‌

3 జీబీ/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ.10,390 ధ‌ర‌కు ల‌భ్యం కానుందని తెలుస్తోంది. 4జీబీ/64జీబీ స్టోరేజ్‌ ధర రూ. 12,460,6జీబీ/64జీబీ స్టోరేజ్‌ ధర రూ.14,540లుగా ఉండనుందని అంచనా.

చైనాలో ధర

చైనాలో దీని ధరను 999 యువాన్ అంటే మ కరెన్సీలో చెప్పాలంటే రూ.10,500గా నిర్ణయించారు. మరి ఇదే ధరకు ఇండియాలో లాంచ్ అవుతుందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాని లాంచింగ్ డేట్ మాత్రం ఫిక్స్ అయింది.

Best Mobiles in India

English Summary

Xiaomi Redmi Note 7 Twitter challenge wants you to answer this More News at Gizbot Telugu